తెలుగు న్యూస్  /  Business  /  Samsung Best Diwali Ever With Rs 14400 Crore Mobile Sales

Samsung Smartphones Sales : పండుగ చేసుకున్న సామ్‍సంగ్.. ఈ మొబైళ్లకు ఎక్కువ గిరాకీ!

05 November 2022, 13:47 IST

    • Samsung Smartphones Sales: ఈ సంవత్సరం పండుగ సీజన్.. సామ్‍సంగ్‍కు బాగా కలిసి వచ్చింది. మొబైల్స్ అమ్మకాల్లో జోరు చూపించింది.
పండుగ చేసుకున్న సామ్‍సంగ్.. ఈ మొబైళ్లకు ఎక్కువ గిరాకీ!
పండుగ చేసుకున్న సామ్‍సంగ్.. ఈ మొబైళ్లకు ఎక్కువ గిరాకీ! (AFP)

పండుగ చేసుకున్న సామ్‍సంగ్.. ఈ మొబైళ్లకు ఎక్కువ గిరాకీ!

Samsung Smartphones Sales: పండుగ సీజన్‍లో పాపులర్ బ్రాండ్ సామ్‍సంగ్ అదరగొట్టింది. స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో దూసుకెళ్లింది. భారత్‍లో రూ.వేలకోట్ల విలువైన మొబైళ్లను సేల్ చేసింది. ఫెస్టివల్ సీజన్ అయిన సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల్లో కలిపి భారత్‍లో రూ.14,400కోట్ల విలువైన సామ్‍సంగ్ స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి.

బెస్ట్​ దివాలీ సేల్స్​..

పండుగ సీజన్‍లో సాధారణంగా ఎక్కువ మంది కొత్త ప్రొడక్టులను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అలాగే ఈ-కామర్స్ సైట్లలో సేల్స్ ఉండడంతో ఎక్కువగా స్మార్ట్ ఫోన్‍లను కొంటుంటారు. అయితే ఈసారి ఫెస్టివల్ సీజన్ సామ్‍సంగ్‍కు విపరీతంగా కలిసి వచ్చింది.

Samsung India sales : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తమ మొబైల్ బిజినెస్ డివిజన్ రూ.14,400కోట్ల రెవెన్యూ సాధించిందని సామ్‍సంగ్ ఇండియా వెల్లడించింది. ఇదే తమ సంస్థకు బెస్ట్ దివాలీ సేల్స్ అని పేర్కొంది. ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ విభాగంలో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‍తో పాటు ఫ్లిప్, ఫోల్డ్ ఫోల్డబుల్ మోడల్స్ సేల్స్ పెరగడంతో సామ్‍సంగ్ దూసుకుపోయింది. ఈ విషయాన్ని సామ్‍సంగ్ ఇండియా మొబైల్స్ బిజినెస్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ బ్లూమ్‍బర్గ్ కు చెప్పారు. మరోవైపు బడ్జెట్, మిడ్ రేంజ్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం సిరీస్, ఎఫ్ సిరీస్ మోడల్స్ ఎక్కువగా అమ్ముడైనట్టు సమాచారం.

ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‍లో ఇండియాలో యాపిల్, సామ్‍సంగ్ మొబైల్స్ ఎక్కువగా సేల్ అయ్యాయని ఐడీసీ ఇండియా వెల్లడించింది. షావోమీ, వివో లాంటి సంస్థలకు అంతగా కలిగి రాలేదని పేర్కొంది.

Samsung smartphones : భారత మొబైల్ మార్కెట్‍లో ఒకప్పుడు పూర్తి ఆధిపత్యం చెలాయించిన సామ్‍సంగ్‍కు షావోమీ, ఒప్పో, వివో, రియల్‍మీ లాంటి సంస్థలు గట్టి పోటీని ఇచ్చాయి. ప్రస్తుతం ఇండియా స్మార్ట్​ఫోన్ మార్కెట్‍ షేర్​లో సామ్‍సంగ్ రెండో స్థానంలో ఉంది.

టాప్​ పొజీషన్​పై సామ్​సంగ్​ కన్ను..

ఇండియా మొబైల్ మార్కెట్‍లో మళ్లీ టాప్‍లోకి వచ్చే లక్ష్యంతో సామ్‍సంగ్ ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‍లను లాంచ్ చేస్తోంది. బ్యాంక్ లతో క్రెడిట్ కార్డ్ భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటోంది.

Samsung smartphones latest news : సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ షిప్‍మెంట్స్ 11 శాతం తగ్గిందని టెక్ రీసెర్చర్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. అయితే ఈ క్వార్టర్​లోనూ వృద్ధిని సాధించిన ఏకైక బ్రాండ్ సామ్‍సంగ్ అని పేర్కొంది. ముఖ్యంగా 5జీ మొబైళ్ల విభాగంలో ఈ కంపెనీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మిడ్​ రేంజ్‍లోనూ హవా చూపిస్తోంది.