తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాయలన్ 450.. ఒకటి కాదు ఐదు మోడళ్లు

Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాయలన్ 450.. ఒకటి కాదు ఐదు మోడళ్లు

29 November 2022, 16:50 IST

    • Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450పై సూపర్ అప్‍డేట్ వచ్చింది. ఈ లైనప్‍లో మొత్తంగా ఐదు మోడళ్లు రానున్నాయి.
Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాయలన్ 450.. ఒకటి కాదు ఐదు మోడళ్లు (Photo courtesy: Instagram/sidlal)
Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాయలన్ 450.. ఒకటి కాదు ఐదు మోడళ్లు (Photo courtesy: Instagram/sidlal)

Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాయలన్ 450.. ఒకటి కాదు ఐదు మోడళ్లు (Photo courtesy: Instagram/sidlal)

Royal Enfield Himalayan 450: రాయల్‍ ఎన్‍ఫీల్డ్ భారీ ప్లాన్‍ను సిద్ధం చేసుకుంది. హిమాలయన్ 450 లైనప్‍పై కీలక అప్‍డేట్‍ను ఇచ్చింది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న హిమాలయన్ 450 బైక్‍ను వచ్చే ఏడాది తీసుకొచ్చేందుకు రాయల్ ఎన్‍ఫీల్డ్ సిద్ధమైంది. అయితే హిమాలయన్ 450 లైనప్‍లో ఒకటి కాదు.. ఏకంగా ఐదు మోడళ్లను తీసుకువాలని రాయల్ ఎన్‍ఫీల్డ్ నిర్ణయించుకుంది. 450సీసీ ఇంజిన్ ప్లాట్‍ఫామ్‍పై ఇవి రానున్నాయి.

Royal Enfield Himalayan 450: వివరాలు

సరికొత్త 450సీసీ ఇంజిన్ ప్లాట్‍ఫామ్‍పై రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450 మోటార్ సైకిల్ రానుంది. ఇప్పటికే ఇండియాలో ఈ బైక్ టెస్టింగ్ జరుగుతోంది. టెస్ట్ కోసం రోడ్లపై వచ్చిన సందర్భాల్లో ఈ నయా హిమాలయన్ 450 బైక్ కెమెరాలకు చిక్కింది. రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450 వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరికొత్త లిక్విడ్ కూల్డ్ 450 సీసీ ఇంజిన్‍ను రాయల్ ఎన్‍ఫీల్డ్ రూపొందించింది. హిమాలయన్ 450 బైక్‍కు ఈ ఇంజిన్ ఉంటుంది.

Royal Enfield Himalayan 450: మరో నాలుగు మోడల్స్

రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450 లైనప్‍లో ఐదు మోడల్స్ ఉండనున్నాయి. రాయల్ ఎన్‍ఫీల్డ్ అఫీషియల్ డాక్యుమెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. హిమాలయన్ 450 సిరీస్‍లో సాధారణ వేరియంట్‍తో పాటు రోడ్‍స్టర్, స్క్రాంబర్లర్, ర్యాలీ, కేఫ్ రేసర్ మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది. ముందుగా హిమాలయన్ 450 విడుదల కానుండగా.. ఆ తర్వాత దీంట్లో వేరియంట్లను తీసుకురానుంది రాయల్ ఎన్‍ఫీల్డ్. ఇవన్నీ 450సీసీ ఇంజిన్‍నే కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450 వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ లైనప్‍లో హిమాలయన్ 450సీసీ రోడ్‍స్టర్ రానుంది. దీన్ని హంటర్ గా పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న హంటర్ కు ఇది అప్‍గ్రేడ్‍గా ఉంటుంది. రోడ్‍స్టర్ తర్వాత హిమాలయన్ 450 లైనప్‍లో మరో స్క్రాంబ్లర్, ర్యాలీ మోడళ్లు రావొచ్చు. ఐదో మోడల్‍గా కేఫ్ రేసర్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ మోడల్స్ లాంచ్ టైమ్ లైన్‍ను రాయల్ ఎన్‍ఫీల్డ్ వెల్లడించలేదు. ర్యాలీ వేరియంట్ రెండు సంవత్సరాల తర్వాత రానున్నట్టు సమాచారం. చివరగా కేఫ్ రేసర్ వస్తుందని అంచనా.

టాపిక్