తెలుగు న్యూస్  /  Business  /  Reliance Jio Launches Jio True 5g Services In 34 More Cities Including 9 Cities In Andhra Pradesh And Telangana

Jio 5G launch: ఏపీ, తెలంగాణలోని మరో 9 నగరాల్లో జియో 5జీ షురూ: ఉచిత డేటా ఆఫర్‌!

31 January 2023, 17:51 IST

    • Jio 5G services launch: జియో 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా మరో 34 నగరాల్లో ప్రారంభమయ్యాయి. వీటిలో ఏపీలోని మరో 6, తెలంగాణలోని 3 సిటీలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇవే.
Jio 5G launch: ఏపీ, తెలంగాణలోని మరో 9 నగరాల్లో జియో 5జీ లాంచ్
Jio 5G launch: ఏపీ, తెలంగాణలోని మరో 9 నగరాల్లో జియో 5జీ లాంచ్

Jio 5G launch: ఏపీ, తెలంగాణలోని మరో 9 నగరాల్లో జియో 5జీ లాంచ్

Jio 5G Services launch: ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని నగరాల్లో జియో ట్రూ 5జీ నెట్‍వర్క్ (Jio True 5G Network) లాంచ్ అయింది. దేశంలో 5జీ సర్వీసులను అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో నేడు (జనవరి 31) దేశంలోని మరో 34 నగరాల్లో 5జీ నెట్‍వర్క్ (5G Network)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‍(AP)లోని మరో 6 సిటీల్లో, తెలంగాణలోని మూడు నగరాల్లో జియో ట్రూ 5జీ లాంచ్ అయింది. దీంతో జియో 5జీ నెట్‍వర్క్ అందుబాటులో ఉన్న సిటీల సంఖ్య ఏపీలో 22కి, తెలంగాణలో తొమ్మిదికి చేరింది. ఏ నగరాల్లో కొత్తగా జియో 5జీ లాంచ్ అయింది, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఏ సిటీల్లో జియో 5జీ అందుబాటులో ఉందో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Gold and silver prices today : బంగారం ధర మళ్లీ పెరిగిందా? ఇక్కడ చెక్​ చేయండి..

200 మార్కును దాటిన జియో

Jio True 5G Network launch: 13 రాష్ట్రాల్లోని మరో 34 నగరాల్లో 5జీ నెట్‍వర్క్‌ను మంగళవారం ప్రారంభించింది రిలయన్స్ జియో. దీంతో జియో ట్రూ 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా 225 నగరాలకు విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్‍లోని అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్లు, నంద్యాల, తెనాలి సిటీల్లో, తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్‍నగర్, రామగుండంల్లో నేడు జియో ట్రూ 5జీ సర్వీసులు మొదలయ్యాయి.

ఏపీలోని ఈ సిటీల్లో జియో 5జీ

Jio 5G in Andhra Pradesh: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, భీమవరం, చీరాల, గుంతకల్లు, నంద్యాల, తెనాలి నగరాల్లో ఇప్పటి వరకు జియో 5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణలో..

Jio 5G in Telangana: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‍నగర్, రామగుండం సిటీల్లో జియో ట్రూ 5జీ సర్వీసులు ఉన్నాయి.

ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్‍వర్క్‌ను విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.

జియో 5జీ వెల్‍కమ్ ఆఫర్

Jio 5G Welcome Offer: జియో 5జీ అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో వెల్‍కమ్ ఆఫర్‌ను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కింద, 5జీ నెట్‍వర్క్‌పై అన్‍లిమిటెడ్ డేటాను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యూజర్లు వాడుకోవచ్చు. అయితే 5జీ నెట్‍వర్క్‌పైనే ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. జియో 5జీ కోసం వినియోగదారులు సిమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్‍తోనే 5జీని వాడుకోవచ్చు. అయితే 5జీకి సపోర్ట్ చేసే మొబైల్ ఉండాలి.