Jio 5G launch: ఏపీలోని మరో 7 నగరాల్లో జియో 5జీ లాంచ్.. తెలంగాణలోని ఇంకో సిటీలో కూడా..-jio true 5g largest rollout jio launches 5g services in 50 more cities including 7 cities in andhra pradesh one in telangana ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Jio True 5g Largest Rollout Jio Launches 5g Services In 50 More Cities Including 7 Cities In Andhra Pradesh One In Telangana

Jio 5G launch: ఏపీలోని మరో 7 నగరాల్లో జియో 5జీ లాంచ్.. తెలంగాణలోని ఇంకో సిటీలో కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 24, 2023 02:45 PM IST

Jio True 5G launch New Cities: ఆంధ్రప్రదేశ్‍లోని మరో 7 సిటీల్లో, తెలంగాణలోని మరో నగరంలో జియో ట్రూ 5జీ సర్వీస్‍లు నేడు లాంచ్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇవే.

Jio 5G launch: ఏపీలోని మరో 7 నగరాల్లో జియో 5జీ లాంచ్.. తెలంగాణలోని మరో సిటీలో..
Jio 5G launch: ఏపీలోని మరో 7 నగరాల్లో జియో 5జీ లాంచ్.. తెలంగాణలోని మరో సిటీలో..

Jio True 5G launch: 5జీ నెట్‍వర్క్ విస్తరణలో దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) దూకుడు పెంచింది. నేడు (జనవరి 24) అతిపెద్ద 5జీ రోల్అవుట్‍ను నమోదు చేసింది. ఒకేరోజు ఏకంగా దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 5జీ సర్వీస్‍లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సర్వీస్‍లు అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 184కు చేరింది. నేడు ఆంధ్రప్రదేశ్‍లోని మరో 7 నగరాల్లో జియో 5జీ నెట్‍‍వర్క్ ప్రారంభమైంది. తెలంగాణలోని మరో సిటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆ నగరాలు ఏవి, ఉచిత ఆఫర్ వివరాలు ఇవే.

తెలుగు రాష్ట్రాల్లోని మరో 8 సిటీల్లో..

Reliance Jio True 5G: ఆంధ్రప్రదేశ్‍లోని చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంలో నేడు (జనవరి 24) 5జీ సర్వీస్‍లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. తెలంగాణలోని నల్గొండలో 5జీ నెట్‍వర్క్‌ను తీసుకొచ్చింది. ఇక ఈ నగగాల్లోని జియో యూజర్లు కూడా 5జీ నెట్‍వర్క్‌ను వాడుకోవచ్చు. అలాగే వెల్‍కమ్ ఆఫర్ కింద 5జీ నెట్‍వర్క్‌పై ఉచితంగా అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని 8 సిటీలతో పాటు దేశంలోని మరో 42 నగరాల్లో నేడు జియో ట్రూ 5జీ ప్రారంభమైంది.

ఏపీ, తెలంగాణలో ఈ నగరాల్లో..

Jio 5G: తాజా రోల్అవుట్‍తో మొత్తంగా ఆంధ్రప్రదేశ్‍లోని 16 నగరాల్లో జియో 5జీ అందుబాటులో ఉంది. తెలంగాణలోని ఆరు సిటీల్లో జియో ట్రూ 5జీ నెట్‍వర్క్ ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, తిరుమల, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడలో ఇప్పటి వరకు జియో 5జీ ఉండగా.. నేడు చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం సిటీల్లో అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‍లో ఇప్పటికే జియో 5జీ నెట్‍వర్క్ ఉండగా.. తాజాగా నల్గొండలో ప్రారంభమైంది.

జియో 5జీ వెల్‍కమ్ ఆఫర్

Jio 5G Welcome Offer: 5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చిన యూజర్లు వెల్‍కమ్ ఆఫర్ కింద అన్‍లిమిడెట్ డేటాను ఉచితంగా వాడుకోవచ్చు. 5జీ నెట్‍వర్క్‌పై ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. మీ ప్రాంతంలో 5జీ అందుబాటులోకి వచ్చాక మీకు జియో నుంచి ఇన్వైట్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాతి నుంచి 5జీ నెట్‍వర్క్‌పై అన్‍లిమిటెడ్ డేటాను ఫ్రీగా వాడుకోవచ్చు. 5జీ కోసం సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీ సర్వీస్‍లకు సపోర్ట్ చేస్తుంది. అయితే 5జీకి సపోర్ట్ చేస్తే స్మార్ట్ ఫోన్ ఉండాలి.

WhatsApp channel

సంబంధిత కథనం