తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rekha Jhunjhunwala: ఈ స్టాక్ తో రూ. 1000 కోట్లు సంపాదించిన రేఖ

Rekha Jhunjhunwala: ఈ స్టాక్ తో రూ. 1000 కోట్లు సంపాదించిన రేఖ

HT Telugu Desk HT Telugu

16 February 2023, 14:27 IST

    • Rekha Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరుగాంచిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) భార్య రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala). రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఇటీవల గుండెపోటుతో మరణించారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rekha Jhunjhunwala: రాకేశ్ ఝున్ ఝున్ వాలా (Rakesh Jhunjhunwala) భార్య రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala) టాటా కంపెనీకి చెందిన ఒక స్టాక్ తో రూ. 1000 కోట్ల లాభం పొందారు. అది కూడా జస్ట్ రెండు వారాల వ్యవధిలోనే.

ట్రెండింగ్ వార్తలు

EPF withdrawal claim : ఈపీఎఫ్​ క్లెయిమ్​ సెటిల్​ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

Mahindra XUV 3XO price : హైదరాబాద్​లో మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా లాంచ్​.. ఫీచర్స్​ ఇవేనా?

Tata Nexon CNG : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​కి ‘సీఎన్​జీ’ టచ్​.. లాంచ్​ ఎప్పుడు?

Titan Company Ltd shares: టైటన్ షేర్లతో..

2023 కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆ మర్నాడు, ఫిబ్రవరి 2న టాటా గ్రూప్ నకు చెందిన టైటన్ కంపెనీ లిమిటెడ్ (Titan Company Ltd) షేరు ధర రూ. 2,310 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా ఆ షేరు ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 15 నాటికి అది రూ. 2,535 కి చేరింది. అంటే, ఒక్కో షేరు విలువ రెండు వారాల వ్యవధిలో రూ. 225 పెరిగింది.

Rekha Jhunjhunwala: రేఖ ఝున్ ఝున్ వాలా కు లాభాలు..

టైటన్ కంపెనీ (Titan Company Ltd) షేర్లు రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala) వద్ద ప్రస్తుతం 4,58,95,970 ఉన్నాయి. అంటే, సుమారు నాలుగున్నర కోట్ల షేర్లు ఆమె వద్ద ఉన్నాయి. టైటన్ కంపెనీ (Titan Company Ltd) మొత్తం పెయిడ్ అప్ కేపిటల్ లో ఇది 5.17%. ఒక్కో షేరు విలువ గత రెండు వారాల్లో రూ. 225 పెరిగిన నేపథ్యంలో.. రేఖ ఝున్ ఝున్ వాలా (Rekha Jhunjhunwala) వద్ద ఉన్న టైటన్ షేర్ల విలువ ఇప్పడు రూ. 10,32,65,93,250. అంటే వెయ్యి కోట్లకు పైమాటే.

టాపిక్