Titan Q2 Results 2022 : క్యూ2లో.. 34శాతం పెరిగిన టైటాన్ లాభాలు
Titan Q2 Results 2022 : 2023 ఆర్థిక ఏడాది క్యూ2లో టైటాన్ సంస్థ లాభాలు దాదాపు 34శాతం పెరిగాయి. ఈ మేరకు త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది ఆ సంస్థ.
Titan Q2 Results 2022 : టైటాన్ సంస్థ.. 2023 రెండో త్రైమాసికం ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. క్యూ2లో టైటాన్ సంస్థ నెట్ ప్రాఫిట్ 33.7శాతం పెరిగి రూ. 857కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ రూ. 641కోట్లుగా ఉండేది.
ట్రెండింగ్ వార్తలు
అంచనాలకు మించిన 'ఫలితాలు'..
టైటాన్ రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్.. రూ. 8,730కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంతో(రూ. 7,170) పోల్చుకుంటే అది 22శాతం ఎక్కువ!
Titan results 2022 : బులియన్ సేల్స్‌ని మినహాయిస్తే, జ్యువెల్లరీ వ్యాపారం.. ఆదాయం పరంగా 18శాతం పెరిగి రూ. 7,203కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 6,106కోట్లుగా నమోదైంది. వాచ్‌లు, వేరెబుల్ బిజినెస్ రెవెన్యూ 21శాతం పెరిగి రూ. 829కోట్లకు చేరింది. గతేడాది ఇది రూ. 687కోట్లుగా ఉండేది. ఐ కేర్ వ్యాపారం 4శాతం పెరిగి రూ. 167కోట్లుగా నమోదైంది.
ఈ క్యూ2 ఫలితాలు.. మార్కెట్ అంచనాలకు మించి ఉండటం విశేషం.
"అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నా.. పండుగ సీజన్ పాజిటివ్‌గానే సాగింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సేల్స్ బాగా జరిగాయి. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్‌కి ఇది సంకేతం. ఇండియాలో సంస్థ వృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మా ప్రదర్శనపై సానుకూలంగానే ఉన్నాము. ఈ ఆర్థిక ఏడాది మిగిలిన త్రైమాసికాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తామని నమ్మకంగా ఉంది," అని టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ తెలిపారు.
ఈ ఏడాదిలో టైటాన్ సంస్థ ఇప్పటివరకు 105 కొత్త స్టోర్స్‌ని తెరిచింది. మొత్తం మీద కంపెనీ రీటైల్ చెయిన్.. 382 పట్టణాలకు విస్తరించింది. 2,408 స్టోర్స్.. దేశవ్యాప్తంగా ఉన్నాయి.
టైటాన్ షేర్లు..
Titan share price : శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి టైటాన్ షేరు ధర రూ. 2,770గా నమోదైంది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 0.32శాతం పెరిగింది. కానీ నెల రోజుల్లో టైటాన్ షేరు ధర 6.83శాతం వృద్ధి చెందింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9.75శాతం పెరిగింది టైటాన్ షేరు ధర.
సంబంధిత కథనం
HDFC Q2 results: అంచనాలను మించిన హెచ్డీఎఫ్సీ లాభాలు
November 03 2022
Nykaa Q2 results : క్యూ2లో 330శాతం పెరిగిన నైకా లాభాలు!
November 01 2022
Tata Power Q2 results: Q2లో పవర్ చూపిన ‘టాటా పవర్’
October 28 2022