తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Red Cross Lay Offs: ‘రెడ్ క్రాస్’ లోనూ ఉద్యోగాల కోత; విరాళాల్లో లోటుతో ఈ నిర్ణయం

Red Cross lay offs: ‘రెడ్ క్రాస్’ లోనూ ఉద్యోగాల కోత; విరాళాల్లో లోటుతో ఈ నిర్ణయం

HT Telugu Desk HT Telugu

05 April 2023, 21:41 IST

  • Red Cross lay offs: ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని అంతర్జాతీయ సేవా సంస్థ రెడ్ క్రాస్ (Red Cross) ప్రకటించింది. 

     

జెనీవాలోని ప్రధాన కార్యాలయంపై రెడ్ క్రాస్ జెండా
జెనీవాలోని ప్రధాన కార్యాలయంపై రెడ్ క్రాస్ జెండా (REUTERS)

జెనీవాలోని ప్రధాన కార్యాలయంపై రెడ్ క్రాస్ జెండా

Red Cross lay offs: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1500మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు (lay off) రెడ్ క్రాస్ (Red Cross) ప్రకటించింది. సంస్థ కు చెందిన కొన్ని ఆఫీసులను శాశ్వతంగా మూసేయబోతున్నట్లు వెల్లడించింది.

Cuts in Red Cross donations : విరాళాల్లో లోటు..

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కార్యక్రమల్లో కొన్నింటిని నిలిపివేయబోతున్నట్లు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ (International Committee of the Red Cross) ప్రకటించింది. ప్రపంచ దేశాలు, సంస్థలు, వ్యక్తుల నుంచి మానవీయ సాయం కోసం అందే విరాళాలు ఆశించిన స్థాయిలో రాలేదని వెల్లడించింది. అందువల్ల రానున్న 12 నెలల్లో సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు (Red Cross) తెలిపింది. అలాగే, కొన్ని కార్యకలాపాలను నిలిపివేయబోతున్నట్లు తెలిపింది. ప్రకృతి విలయాలు, యుద్ధం, మిలటరీ ఆపరేషన్ల సమయంలో రెడ్ క్రాస్ (Red Cross) సహాయ కార్యక్రమాలు చేపడుతుంది. ఆహారం, వైద్యం అందిస్తుంది. అఫ్గానిస్తాన్, సిరియా, ఇథియోపియా, ఉక్రెయిన్ సహా పలు దేశాల్లో ప్రస్తుతం రెడ్ క్రాస్ (Red Cross) సేవలు కొనసాగుతున్నాయి.

Red Cross lay offs: 20 వేల మంది ఉద్యోగులు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 350 కేంద్రాల్లో 20 కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినట్లు రెడ్ క్రాస్ (Red Cross) తెలిపింది. అయితే, ఆ కేంద్రాల్లో కొన్నింటిని శాశ్వతంగా మూసేస్తామని, మరి కొన్నింటి నిర్వహణను సమీపంలోని మరో కేంద్రానికి కానీ, వేరే ఛారిటీ సంస్థకు కానీ అప్పగిస్తామని చెప్పింది. సంవత్సరాంతానికి అందే విరాళాల్లో పెద్ద ఎత్తుల లోటు ఏర్పడిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాలు తప్పడం లేదని రెడ్ క్రాస్ (Red Cross) వెల్లడించింది. రెడ్ క్రాస్ (International Committee of the Red Cross ICRC) 1863లో లాభాపేక్ష లేని స్వచ్ఛంధ సంస్థగా ఏర్పడింది. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో హెడ్ ఆఫీస్ ఉన్న Red Cross సంస్థలో సుమారు 20 వేల ఉద్యోగులున్నారు. సుమారు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. సంస్థలు, ప్రభుత్వాలు, వ్యక్తులు ఇచ్చే స్వచ్చంధ విరాళాల ద్వారా ఈ సంస్థకు ఆదాయం సమకూరుతుంది.

టాపిక్