తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco X5 5g Launch Today: పోకో ఎక్స్5 5జీ ఫోన్ విడుదల నేడే: లాంచ్ టైమ్, స్పెసిఫికేషన్‍ల వివరాలివే

Poco X5 5G launch today: పోకో ఎక్స్5 5జీ ఫోన్ విడుదల నేడే: లాంచ్ టైమ్, స్పెసిఫికేషన్‍ల వివరాలివే

14 March 2023, 5:43 IST

    • Poco X5 5G launch today: పోకో ఎక్స్5 5జీ మొబైల్ నేడు విడుదల కానుంది. రూ.20వేలలోపు ధరతోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
Poco X5 5G launch today: పోకో ఎక్స్5 5జీ ఫోన్ విడుదల నేడే (Photo: Poco)
Poco X5 5G launch today: పోకో ఎక్స్5 5జీ ఫోన్ విడుదల నేడే (Photo: Poco)

Poco X5 5G launch today: పోకో ఎక్స్5 5జీ ఫోన్ విడుదల నేడే (Photo: Poco)

Poco X5 5G India launch: ఎక్స్5 సిరీస్‍ (Poco X5 Series) లో మరో 5జీ మొబైల్‍ను తీసుకొచ్చేందుకు షావోమీ సబ్‍బ్రాండ్ పోకో (Poco) రెడీ అయింది. పోకో ఎక్స్5 5జీ ఫోన్ నేడు (మార్చి 14) ఇండియాలో లాంచ్ కానుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో ఈ ఫోన్ రానుంది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ఇప్పటికే ఇండియాలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఎక్స్5 5జీ అడుగుపెడుతోంది. గ్లోబల్‍గా ఇప్పటికే విడుదలవటంతో పోకో ఎక్స్5 5జీ ఫోన్ గురించి కొన్ని వివరాలు బయటికి వచ్చాయి.

పోకో ఎక్స్5 5జీ లాంచ్ వివరాలు

Poco X5 5G launch today: పోకో ఎక్స్5 5జీ ఫోన్ నేడు (మార్చి 14) మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Poco X5 5G - Flipkart)లో అందుబాటులోకి వస్తుంది. గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో లభ్యం కానుంది.

పోకో ఎక్స్5 5జీ గ్లోబల్‍‍గా లాంచ్ అవటంతో ఇప్పటికే ఈ ఫోన్‍కు సంబంధించిన స్పెసిఫికేషన్లు తెలిసిపోయాయి. గ్లోబల్ వేరియంట్‍ను పోలిన స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ ఇండియా మార్కెట్‍లోనూ అడుగుపెట్టనుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉండే 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ,సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేను పోకో ఎక్స్5 5జీ కలిగి ఉంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో రావొచ్చు.

పోకో ఎక్స్5 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉండనుండగా.. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్‍లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

పోకో ఎక్స్5 5జీ ధర రూ.20వేలలోపు ఉండనుంది. మూడు కలర్ ఆప్షన్‍లలో అందుబాటులోకి రానుంది. నేటి లాంచ్ ఈవెంట్ పోకో పూర్తి వివరాలను వెల్లడించనుంది.

పోకో ఎక్స్5 ప్రో 5జీ (Poco X5 Pro 5G) ఇటీవలే ఇండియాలో లాంచ్ అయింది. స్నాప్‍డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 6.67 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 120Hz ఆమెలెడ్ డిస్‍ప్లేతో వచ్చింది. 5000mAh బ్యాటరీ, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. వెనుక 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‍ ప్రారంభ ధర రూ.22,999గా ఉంది. ఫ్లిప్‍కార్ట్‌లో సేల్‍కు ఉంది.