తెలుగు న్యూస్  /  Business  /  Oneplus Buds Pro 2 Launched Check Price Specifications Features Details It Will Release India In Next Month

OnePlus Buds Pro 2: డైనో ఆడియో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ నయా ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

05 January 2023, 6:45 IST

    • OnePlus Buds Pro 2 TWS Earbuds: వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 విడుదలైంది. ఈ బడ్స్‌లో రెండు సౌండ్లు డ్రైవర్లు ఉండడం ప్రత్యేకతగా ఉంది. ఈ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ఫిబ్రవరిలో ఇండియాలోనూ లాంచ్ కానున్నాయి.
OnePlus Buds Pro 2: డైనో ఆడియో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ నయా ఇయర్‌బడ్స్ లాంచ్ (Photo: OnePlus)
OnePlus Buds Pro 2: డైనో ఆడియో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ నయా ఇయర్‌బడ్స్ లాంచ్ (Photo: OnePlus)

OnePlus Buds Pro 2: డైనో ఆడియో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లతో వన్‍ప్లస్ నయా ఇయర్‌బడ్స్ లాంచ్ (Photo: OnePlus)

OnePlus Buds Pro 2 TWS Earbuds: వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ వచ్చేశాయి. చైనా మార్కెట్‍లో ఈ నయా ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి. వన్‍ప్లస్ 11 5జీతో పాటు అడుగుపెట్టాయి. ఫిబ్రవరి 7వ తేదీన ఇండియాలోనూ రెండో ఒకేసారి లాంచ్ అవుతాయి. డ్యుయల్ సౌండ్ డ్రైవర్ సిస్టమ్ వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 కు ప్రత్యేకతగా ఉన్నాయి. సబ్‍వూఫర్, ట్వీకర్.. ఇలా బడ్స్ లో డ్యుయల్ సౌండ్ డ్రైవర్లు ఉండడం హైలైట్‍గా ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా మెరుగ్గా ఉంది. OnePlus Bids Pro 2 ధర, స్పెసిఫికేషన్లు ఇక్కడ చూడండి.

OnePlus Buds Pro 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

11 మిల్లీమీటర్ల (mm) వూఫర్, 6mm ట్వీటర్ సౌండ్ డ్రైవర్లను ఈ ఇయర్‌బడ్స్ కలిగి ఉంటాయి. బ్లూటూత్ 5.3 వెర్షన్ కనెక్టివిటీతో వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 వస్తోంది. ఎల్‍హెచ్‍డీసీ, ఏఏసీ, ఎస్‍బీసీ, ఎల్‍సీ 3 ఆడియో కొడెక్‍లు ఈ బడ్స్ సపోర్ట్ చేస్తాయి. మంచి సరౌండ్ ఎక్స్ పీరియన్స్ ఉండేందుకు స్పెషల్ ఆడియో సపోర్టును కూడా ఇచ్చినట్టు వన్‍ప్లస్ పేర్కొంది.

యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) ఫీచర్‌ను వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 కలిగి ఉంది. పరిసరాల్లోని 48డెసిబుల్స్ వరకు శబ్దాన్ని నిరోధించగలదు. ఒక్కో ఇయర్ బడ్‍కు మూడు మైక్రో ఫోన్స్ ఉంటాయి.

చార్జింగ్ కేస్‍తో కలిపి OnePlus Buds Pro 2 ఇయర్‌బడ్స్ 39 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయని వన్‍ప్లస్ పేర్కొంది. చార్జింగ్ కేస్‍లో 520mAh బ్యాటరీ ఉంటుంది. గంటలోనే ఇది ఫుల్ చార్జ్ అవుతుందని వన్‍ప్లస్ వెల్లడించింది. క్యూఐ వైర్లెస్ చార్జింగ్‍కు ఇది సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ55 రేటింగ్‍తో ఈ నయా వన్‍ప్లస్ ఇయర్‌బడ్స్ వస్తున్నాయి.

OnePlus Buds Pro 2 ధర

చైనాలో వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 ధర 899 యెన్లు (సుమారు రూ.11,000)గా ఉంది. ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది. అక్కడ ఈ నెల 9వ తేదీన ఈబడ్స్ సేల్‍కు వస్తాయి. కాగా, ఫిబ్రవరి 7న జరిగే క్లౌడ్ 11 ఈవెంట్ ద్వారా ఇండియాలోనూ వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 లాంచ్ అవుతుంది.

టాపిక్