తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartwatch: మెటాలిక్ స్ట్రాప్స్‌తో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్: వివరాలివే

Smartwatch: మెటాలిక్ స్ట్రాప్స్‌తో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ లాంచ్: వివరాలివే

30 April 2023, 21:05 IST

    • Pebble Cosmos Bold Pro: పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. మెటాలిక్ స్ట్రాప్స్, మెటాలిక్ బాడీ, కర్వ్డ్ డిస్‍ప్లే గ్లాత్‍తో ఈ వాచ్ వచ్చింది.
Smartwatch: మెటాలిక్ స్ట్రాప్స్‌తో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో వాచ్ లాంచ్ (Photo: Pebble)
Smartwatch: మెటాలిక్ స్ట్రాప్స్‌తో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో వాచ్ లాంచ్ (Photo: Pebble)

Smartwatch: మెటాలిక్ స్ట్రాప్స్‌తో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో వాచ్ లాంచ్ (Photo: Pebble)

Pebble Cosmos Bold Pro: పెబల్ బ్రాండ్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ మార్కెట్‍లోకి వచ్చింది. కాస్మోస్ బోల్డ్ వాచ్ ప్రో ఇటీవలే రాగా.. ఇప్పుడు ఈ లైనప్‍లో ప్రో మోడల్‍ను పెబల్ తీసుకొచ్చింది. పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో (Pebble Cosmos Bold Pro) తాజాగా భారత్‍లో లాంచ్ అయింది. మెటాలిక్ స్ట్రాప్‍లతో ఈ వాచ్ వచ్చింది. 2.5డీ కర్వ్డ్ ఎడ్జెస్ గ్లాస్ ఉండే రౌండ్ షేప్డ్ డిస్‍ప్లే ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సహా హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్ అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ వాచ్ సేల్‍కు వచ్చింది.పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో ధర, సేల్

Pebble Cosmos Bold Pro: పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ ధర రూ.2,799గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్, పెబల్ అధికారిక వెబ్‍సైట్‍లో సేల్‍కు వచ్చింది. బ్లాక్, గోల్డ్, మెటల్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ అందుబాటులో ఉంది.

పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Pebble Cosmos Bold Pro: పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ మెటల్ స్ట్రాప్‍లను కలిగి ఉంది. మెటల్ బాడీతో వచ్చింది. 1.39 ఇంచుల HD IPS TFT డిస్‍ప్లేతో ఈ వాచ్ అందుబాటులోకి వచ్చింది. 2.5 D కర్వ్డ్ ఎడ్జెస్ గ్లాస్ ఈ డిస్‍ప్లేపై ఉంటుంది. 500 నిట్స్ వరకు బ్రైట్‍నెస్ ఉంటుంది. విభిన్న వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

Pebble Cosmos Bold Pro: హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే ఎస్‍పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లతో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ వచ్చింది. విభిన్నమైన 100కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీతో వస్తోంది.

Pebble Cosmos Bold Pro: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో వాచ్ వచ్చింది. దీంతో బ్లూటూత్ ద్వారా ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడుకోవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లోనే రిసీవ్ చేసుకోవచ్చు. ఫోన్ మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరాను వాచ్‍ ద్వారా కంట్రోల్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.

ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్‌వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని పెబల్ చెబుతోంది. అయితే, ఎక్కువగా వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ తక్కువగా రావొచ్చు. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ7 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగిఉంది.