తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Introduces Bba Course In Retail Management, Partners With Bengaluru College

BBA course from Maruti Suzuki: మారుతి సుజుకీ ఆఫర్ చేస్తున్న బీబీఏ ఇన్ రిటైల్ మేనేజ్మెంట్

HT Telugu Desk HT Telugu

27 May 2023, 18:38 IST

  • ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకీ తమ ఇండస్ట్రీ అవసరాల కోసం వివిధ కాలేజీల భాగస్వామ్యంతో బీబీఏ కోర్సులను ఆఫర్ చేస్తోంది. తాజాగా, బెంగళూరులోని క్రీస్తు జయంతి (Kristu Jayanti College) కాలేజీ భాగస్వామ్యంతో రిటైల్ మేనేజ్మెంట్ (BBA in retail management) లో బీబీఏ కోర్సును ఆఫర్ చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిటైల్ మేనేజ్మెంట్ లో బీబీఏ (BBA in retail management) కోర్సును బెంగళూరు లోని క్రీస్తు జయంతి (Kristu Jayanti College) కాలేజీ భాగస్వామ్యంతో మారుతి సుజుకీ సంస్థ ఆఫర్ చేస్తోంది. ఇండస్ట్రీ అవసరాల కోసం నిపుణులైన మానవ వనరులను సమకూర్చుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మారుతి సుజుకీ ప్రారంభించింది.

2023-24 విద్యా సంవత్సరం నుంచి..

మారుతి సుజుకీ ఆఫర్ చేసే బీబీఏ (రిటైల్ మేనేజ్మెంట్) 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఈ కోర్సు ప్రొగ్రామ్ ను మారుతి సుజుకీ, క్రీస్తు జయంతి కళాశాల సంయుక్తంగా రూపొందించాయి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఈ కోర్సు ప్రొగ్రామ్ ను రూపొందించినట్లు వారు వెల్లడించారు. భారత ప్రభుత్వ స్కిల్ ఇండియా ఇనీషియేటివ్ స్ఫూర్తిగా ఈ కోర్సును రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ బీబీఏ రిటైల్ మేనేజ్మెంట్ మొత్తం 3 సంవత్సరాల కోర్సు. మొదటి సంవత్సరం థీయరీ క్లాసెస్ తో క్లాస్ రూమ్ స్టడీ ఉంటుంది. ఆ తరువాత రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ (on-the-job training OJT) లో సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రాక్టికల్ మెళకువలను నేర్పిస్తారు. ఇందుకోసం విద్యార్థులను బెంగళూరులోని వివిధ మారుతి సుజుకీ డీలర్ షిప్ ల వద్దకు పంపిస్తారు. పని వాతావరణం, ఉద్యోగ మెళకువలు, అక్కడి ఒత్తిడి వంటి వాటిని ఈ OJT లో విద్యార్థులు ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. అంతేకాదు, ఈ రెండు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ కూడా ఇస్తారు. కోర్సు పూర్తయిన తరువాత, విద్యార్థి పర్ఫార్మెన్స్ ను బట్టి ప్లేస్ మెంట్ లభిస్తుంది.

ఏడు కాలేజీలతో టై అప్

ఇప్పటివరకు మారుతి సుజుకీ దేశవ్యాప్తంగా ఏడు కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అవి గురుగ్రామ్ లోని శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ, ఢిల్లీ లోని ఢిల్లీ స్కిల్ అండ్ అంట్రప్రెన్యూర్ షిప్ యూనివర్సిటీ, సావిత్రి బాయి ఫులే యూనివర్సిటీ (పుణె), జీఎల్ఎస్ యూనివర్సిటీ (అహ్మదాబాద్), టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ముంబై), బీకే బిర్లా కాలేజీ (కళ్యాణ్), సెంచూరియన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (భువనేశ్వర్).

టాపిక్