తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jet Airways To Cut Salaries, Send Many Staff: ఉద్యోగులకు జెట్ ఎయిర్ వేస్ షాక్

Jet Airways to cut salaries, send many staff: ఉద్యోగులకు జెట్ ఎయిర్ వేస్ షాక్

HT Telugu Desk HT Telugu

18 November 2022, 23:01 IST

  • Jet Airways to cut salaries, send many staff: కొన్ని సంవత్సరాలుగా ఆపరేషన్స్ లో లేని జెట్ ఎయిర్ వేస్ సంస్థ తన ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

జెట్ ఎయిర్ వేస్ విమానం (ఫైల్ ఫొటో)
జెట్ ఎయిర్ వేస్ విమానం (ఫైల్ ఫొటో) (MINT_PRINT)

జెట్ ఎయిర్ వేస్ విమానం (ఫైల్ ఫొటో)

Jet Airways to cut salaries, send many staff: జెట్ ఎయిర్ వేస్ 2019 ఏప్రిల్ లో విమాన యాన సేవలను నిలిపేసింది. ఆ తరువాత జెట్ ఎయిర్ వేస్ ను కొనుగోలు చేసేందుకు జాలన్ కాల్రాక్ కన్సార్షియం(Jalan-Kalrock Consortium -JKC) ముందుకు వచ్చింది.

Jet Airways to cut salaries, send many staff: JKC టేకోవర్

2021 జూన్ లో National Company Law Tribunal (NCLT) ఆధ్వర్యంలో సంస్థ టేకోవర్ ప్రక్రియ ముగిసింది. అయితే, వివిధ కారణాల వల్ల JKC కూడా విమానయాన సేవలను ప్రారంభించలేదు. సమీప భవిష్యత్తులో అవి ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

Jet Airways to cut salaries, send many staff: ఉద్యోగులకు గుడ్ బై

ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ సంస్థ తమ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాలను తగ్గించడంతో పాటు, మెజారిటీ ఉద్యోగులను వేతనం లేని సెలవుపై పంపించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. ‘జెట్’ ఆదాయ వ్యయాల సమతౌల్యత కోసం, తాత్కాలికంగానైనా, కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని JKC ఇప్పటికే ప్రకటించింది.

Jet Airways to cut salaries, send many staff: 50 % సాలరీ కట్

జెట్ ఎయిర్ వేస్ లోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సంస్థలో ఉన్న ఉద్యోగులకు వేతనంలో కనీసం 50% కోత ఉంటుంది. సీఈఓ, సీఎఫ్ఓ తదితర సీనియర్ పొజిషన్ల వేతనాల్లో మరింత ఎక్కువ కోత ఉంటుంది. మొత్తం స్టాఫ్ లో 10% ఉద్యోగులను తాత్కాలిక సెలవుపై పంపిస్తారు. ఈ సెలవు కాలానికి వేతనం ఉండదు. అలాగే, మిగతా వారిలో దాదాపు 35% ఉద్యోగులకు వేతనంలో కోత ఉంటుంది. ఈ నిర్ణయాలన్నీ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దాదాపు ఇవే విషయాలను జెట్ ఎయిర్ వేస్(Jet Airways) సీఈఓ సంజీవ్ కపూర్ వరుస ట్వీట్లలో వెల్లడించారు. మొత్తం స్ఠాఫ్ లో దాదాపు 60% మందిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన తెలిపారు. అలాగే, ఏ ఉద్యోగిని కూడా ఉద్యోగం నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో సుమారు 250 మంది ఉద్యోగులున్నారు.