తెలుగు న్యూస్  /  Business  /  'How To File Itr Online' One Of The Top Google Searches In 2022

Google top searches in 2022: ఈ సంవత్సరం ఇవే గూగుల్ లో ఎక్కువగా వెతికిన విషయాలు..

HT Telugu Desk HT Telugu

16 December 2022, 21:07 IST

  • Google top searches in 2022: ఇప్పుడు ఏ విషయంపై సమాచారం కావాలన్నా గూగుల్ పై ననే ఆధారపడుతున్నాం. మన ఇంటి దగ్గర ఉన్న ప్లంబర్ సమాచారం నుంచి నాసా ప్రయోగించే ఉపగ్రహాల సమాచారం వరకు.. ఏం కావాలన్నా గూగులే ఇప్పుడు ఆధారం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google top searches in 2022: 2022 సంవత్సరంలో భారత్ లో నెటిజనులు అత్యంత ఎక్కువగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. గూగుల్ ట్రెండ్స్ ఈయర్ ఇన్ సెర్చ్ 2022 రిపోర్ట్(Google trends Year in Search 2022 report) ప్రకారం గూగుల్ లో అత్యధికంగా వెతికిన అంశాల వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Google top searches in 2022: గూగుల్ సెర్చ్

గూగుల్ సెర్చ్ లో భారతీయులు అత్యధికంగా వెతికిన వాటిలో ‘ఆన్ లైన్ లో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా?(‘How to file ITR online’)’ అన్న విషయం కూడా ఉంది. జులై 24 నుంచి జులై 30 మధ్య ఈ విషయంపై నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేశారట. ‘ఎలా(How to)’ అనే కేటగిరీలో ఈ ప్రశ్న 78వ స్థానంలో నిలిచిందట.

Google top searches in 2022: How to బనానా బ్రెడ్ తయారు చేయడం ఎలా?

ఈ . ‘ఎలా(How to)’ కేటగిరీలో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశం ‘కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?(How to download vaccination certificate)’ అనేది కూడా ఉందట. వాటితో పాటు PTRC challan ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?(How to download PTRC challan), పోర్న్ స్టార్ మార్టిని డ్రింక్ ను తాగడం ఎలా?(How to drink Pornstar martini), ఈ శ్రమ్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?(How to make an e-SHRAM card), ప్రెగ్నెన్సీ సమయంలో మోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం ఎలా?(How to stop motions during pregnancy), ఓటర్ ఐడీతో ఆధార్ ను లింక్ చేయడం ఎలా? (How to link voter ID with Aadhaar), బనానా బ్రెడ్ తయారు చేయడం ఎలా?(How to make banana bread), ఇమేజ్ పై హిందీ టెక్ట్స్ ను రాయడం ఎలా?(How to write Hindi text on image)… వంటివి కూడా హౌ టు కేటగిరీలో టాప్ సెర్చెస్ లో నిలిచాయట.

Sports topics in Google top searches in 2022: టాప్ సెర్చెస్ లో స్పోర్ట్స్ విషయాలే ఎక్కువ..

గూగుల్ లో అత్యధికంగా వెతికిన అంశాల్లో తొలి స్థానంలో ఐపీఎల్(The Indian Premier League IPL) ఉంది. తరువాత స్థానంలో కరోనా సమాచారానికి, కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ప్రభుత్వం ప్రారంభించిన వెబ్ సైట్ కోవిన్(CoWIN) ఉంది. ఆ తరువాత స్థానంలో ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ () ఉంది. ఆ తరువాత స్థానాల్లో కూడా స్పోర్ట్స్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి నాలుగో స్థానంలో ఆసియా కప్(Asia Cup), 5వ స్థానంలో ఐసీసీ మెన్స్ టీ 20(ICC Men's T20 World Cup,), 10వ స్థానంలో ఇండియన్ సూపర్ లీగ్(Indian Super League) ఉన్నాయి. అలాగే, ఆరో స్థానంలో హిందీ మూవీ బ్రహ్మస్త్ర(Brahmastra), 9వ స్థానంలో కేజీఎఫ్ 2(KGF: Chapter 2) నిలిచాయి.