తెలుగు న్యూస్  /  Business  /  Honda Shine 100 Vs Hero Splendor Plus Check Price Specifications Of These Motorcycles

Honda Shine 100 vs Hero Splendor Plus: ఈ రెండు 100cc బడ్జెట్ బైక్‍ల్లో ఏది బెస్ట్? ధర, స్పెసిఫికేషన్లు

21 March 2023, 11:21 IST

  • Honda Shine 100 vs Hero Splendor Plus: భారత మార్కెట్‍లోకి ఇటీవల హోండా షైన్ 100 అడుగుపెట్టింది. పాపులర్ హీరో స్ప్లెండర్ ప్లస్‍కు పోటీ ఇచ్చేందుకు వచ్చింది. ఈ రెండు బైక్‍లను పోల్చి చేస్తే ఎలా ఉన్నాయంటే..

Honda Shine 100 vs Hero Splendor Plus: ఈ బడ్జెట్ బైక్‍లు ఎలా ఉన్నాయి!
Honda Shine 100 vs Hero Splendor Plus: ఈ బడ్జెట్ బైక్‍లు ఎలా ఉన్నాయి!

Honda Shine 100 vs Hero Splendor Plus: ఈ బడ్జెట్ బైక్‍లు ఎలా ఉన్నాయి!

Honda Shine 100 vs Hero Splendor Plus: భారత టూ వీలర్ మార్కెట్‍లో హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్.. టాప్ కంపెనీలుగా ఉన్నాయి. బైక్‍లు, స్కూటర్ల విభాగాల్లో ఈ రెండు బ్రాండ్లు పోటీపడుతుంటాయి. తాజాగా షైన్ లైనప్‍లో తక్కువ ధర మోడల్‍ను హోండా లాంచ్ చేసింది. హోండా షైన్ 100 (Honda Shine 100) బైక్‍ను తీసుకొచ్చింది. ముఖ్యంగా హీరో స్ప్లెండర్ ప్లస్‍(Hero Splendor Plus)కు దీన్ని పోటీగా తీసుకొచ్చింది. ఈ రెండు 100సీసీ బైక్‍ సెగ్మెంట్‍లో ఉన్నాయి. ఈ విభాగంలో ప్రస్తుతం స్ప్లెండర్ ప్లస్ ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్‍గా కొనసాగుతోంది. దీనికి షైన్ 100ను పోటీగా తెచ్చింది హోండా. మరి ఈ రెండు బైక్‍లను పోల్చి చూస్తే ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

ధరలు ఇలా..

Honda Shine 100 vs Hero Splendor Plus: హోండా షైన్ 100 ఇంట్రడక్టరీ ధర రూ.64,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మరోవైపు హీరో స్ప్లెండర్ ప్లస్ ధర రూ.74,420 - రూ.74,710 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ధర విషయానికి వస్తే షైన్ 100 చాలా పోటీగా ఉంది. సుమారు స్ప్లెండర్ కంటే రూ.10,000 తక్కువకే షైన్ 100 ప్రస్తుతం లభిస్తోంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

Honda Shine 100 vs Hero Splendor Plus: 99.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, ఫోర్-స్పీడ్ గేర్ బాక్సును హోండా షైన్ 100 కలిగి ఉంది. ఈ ఇంజిన్ 7.6 hp పీక్ పవర్, 8.05 Nm గరిష్ట టార్క్యూను జనరేట్ చేస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్.. 97.2 cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‍తో వస్తోంది. ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. 8.02 hp పీక్ పవర్‌ను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయగలదు. టార్క్యూ విషయంలో రెండు బైక్‍లు ఒకేలా ఉన్నాయి. పవర్ విషయంలో స్ప్లెండర్ కాస్త మెరుగ్గా ఉంది.

మరిన్ని వివరాలు

Honda Shine 100 vs Hero Splendor Plus: 17 ఇంచుల అలాయ్ వీల్‍లను హోండా షైన్ 100 కలిగి ఉండగా.. 18 ఇంచుల అలాయ్ వీల్‍లతో హీరో స్ప్లెండర్ ప్లస్ వస్తోంది. ఈ రెండు బైక్‍లకు ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. ముందు వెనుక డ్రమ్ బ్రేక్‍లను ఈ బైక్‍లు కలిగి ఉన్నాయి. హోండా షైన్‍ 100కు 9 లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్ ఉండగా.. స్ప్లెండర్ ప్లస్ బైక్‍కు 9.8 లీటర్ల ఫ్యుయల్ కెపాసిటీ ట్యాంక్ ఉంటుంది. స్ప్లెండర్‌తో పోలిస్తే షైన్ 100 వీల్ బేస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. షైన్ 100 బైక్ వీల్ బేస్ 1,245 mmగా ఉంది. స్ప్లెండర్ ప్లస్ వీల్ బేస్ 1,236mmగా ఉంది.