Honda Shine 100: చౌకైన హోండా షైన్ బైక్: ముఖ్యమైన 5 అంశాలు ఇవే-honda shine 100 price specifications features engine details check details of this new affordable motorcycle ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Shine 100: చౌకైన హోండా షైన్ బైక్: ముఖ్యమైన 5 అంశాలు ఇవే

Honda Shine 100: చౌకైన హోండా షైన్ బైక్: ముఖ్యమైన 5 అంశాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 16, 2023 06:22 AM IST

Honda Shine 100: బడ్జెట్ రేంజ్‍లో హోండా షైన్ 100 బైక్ లాంచ్ అయింది. 100cc ఇంజిన్‍తో అడుగుపెట్టింది. ఈ బైక్ గురించిన ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూడండి.

Honda Shine 100: చౌకైన హోండా షైన్ బైక్: ముఖ్యమైన 5 అంశాలు ఇవే (Photo: HT Auto)
Honda Shine 100: చౌకైన హోండా షైన్ బైక్: ముఖ్యమైన 5 అంశాలు ఇవే (Photo: HT Auto)

Honda Shine 100: ఎంతో పాపులర్ అయిన హోండా షైన్ (Honda) లైనప్‍‍లో 100cc బైక్ (100 cc Bike) అడుగుపెట్టింది. షైన్ లైనప్‍లో అత్యంత చౌకైన మోడల్‍గా హెండా షైన్ 100 (Honda Shine 100) తాజాగా లాంచ్ అయింది. హోండా ఈ బైక్‍ను భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చింది. ఓబీడీ-2 నిబంధనలకు అనుగుణంగా ఈ బైక్‍ ఇంజిన్‍ను రూపొందించింది. ఇప్పుడు ఇదే చీపెస్ట్ హోండా బైక్. హోండా షైన్ 100 గురించి ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడండి.

Honda Shine 100: ఇంజిన్, పర్ఫార్మెన్స్

99.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‍ను ఈ నయా హోండా షైన్ కలిగి ఉంది. 7,500 ఆర్పీఎం వద్ద 7.5 బీహెచ్‍పీని, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేస్తుంది. ఆటో చోక్ సిస్టమ్ ఉంటుంది. ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్‌ను ఈ బైక్ కలిగి ఉంది.

Honda Shine 100: హార్డ్‌వేర్

సస్పెన్షన్ కోసం, హోండా షైన్ 100 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉంటాయి. వెనుక డ్యుయల్ షాక్స్ ఉంటాయి. ఇక ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‍లతో ఈ బైక్ వస్తోంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ట్యూబ్ లైస్ టైర్లను కలిగి ఉంది.

Honda Shine 100: డిజైన్

ఫైవ్ స్పోక్ అలాయ్ వీల్‍లను హోండా షైన్ 100 కలిగి ఉంది. బ్లాక్ హెండ్ ల్యాంప్ కౌల్ ఉంటుంది. ఈ బైక్‍కు హోలోజన్ హెడ్‍ల్యాంప్ ఉంటుంది. సింగిల్ పీస్ సీట్‍తో చూడడానికి ఈ సెగ్మెంట్‍లో ఇతర బైక్‍లలానే ఉంది. ఐదు కలర్ ఆప్షన్లలో హెండా షైన్ 100 అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ బేస్‍గా రెడ్, బ్లూ, గ్రీన్, గోల్డ్, గ్రే స్ట్రిప్స్ కలర్ వేరియంట్లు ఉన్నాయి.

Honda Shine 100: ఫీచర్లు

బడ్జెట్ ధరలో ఉండటంతో హెండా షైన్ 100 చాలా సింపుల్ ఫీచర్లతో వస్తోంది. ఈ బైక్‍కు హోలోజన్‍ హెడ్‍ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. ట్విన్ పోడ్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది. దీంట్లో స్పీడో మీటర్, ఒడోమీటర్, ఫ్యుయల్ లెవెల్ గేజ్ ఉన్నాయి. సైడ్ స్టాండ్ సెన్సార్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‍తో ఈ నయా షైన్ 100 వస్తోంది.

హోండా షైన్ 100 ధర

Honda Shine 100 Price: హోండా షైన్ 100 ధర రూ.64,900 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. బుకింగ్‍లు కూడా ఓపెన్ అయ్యాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా, హీరో హెచ్‍ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‍లు ఈ సెగ్మెంట్‍లో షైన్‍కు 100 పోటీగా ఉన్నాయి.

సంబంధిత కథనం

టాపిక్