తెలుగు న్యూస్  /  Business  /  Hero Super Splendor Xtec Launched With Updated Features New Design

Hero Super Splendor XTEC: కొత్త ఫీచర్లు, అప్‍డేటెడ్ డిజైన్‍తో హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ లాంచ్.. వివరాలివే

06 March 2023, 21:04 IST

    • Hero Super Splendor XTEC: ప్రీమియమ్ కనెక్టివిటీ ఫీచర్లు, డిజైన్ అప్‍డేట్‍తో హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ లాంచ్ అయింది. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. ఈ బైక్ పూర్తి వివరాలు ఇవే.
Hero Super Splendor XTEC: కొత్త ఫీచర్లు, అప్‍డేటెడ్ డిజైన్‍తో హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ లాంచ్
Hero Super Splendor XTEC: కొత్త ఫీచర్లు, అప్‍డేటెడ్ డిజైన్‍తో హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ లాంచ్

Hero Super Splendor XTEC: కొత్త ఫీచర్లు, అప్‍డేటెడ్ డిజైన్‍తో హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ లాంచ్

Hero Super Splendor XTEC Bike: పాపులర్ స్ప్లెండర్ (Splendor) లైనప్‍లో నయా సూపర్ ఎక్స్‌టెక్ బైక్‍ను హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది. 2023 హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ (New Hero Super Splendor XTEC) బైక్ సోమవారం భారత మార్కెట్‍లో విడుదలైంది. రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రీమియమ్ కనెక్టివిటీ ఫీచర్లు, స్లైలింగ్ అప్‍డేట్‍లతో ఈ కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 125cc బైక్ వచ్చింది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

Gold and silver prices today : బంగారం ధర మళ్లీ పెరిగిందా? ఇక్కడ చెక్​ చేయండి..

నయా కనెక్టివిటీ ఫీచర్లు, స్టైలింగ్‍తో..

Hero Super Splendor XTEC Bike: యువతను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్‍ బైక్‍ను హీరో రూపొందించింది. పంచీ స్టైలింగ్, కనెక్టివిటీ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. హై ఇంటెన్సిటీ పొజిషనింగ్ ఎల్ఈడీ హెచ్‍ల్యాంప్, పుల్లీ డిజిటల్ కన్సోల్‍ను ఈ నయా బైక్ కలిగి ఉంది. ఫ్యుయల్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, మాల్‍ఫంక్షన్ ఇండికేటర్ లాంటి సమాచారం డిజిటల్ స్పీడో మీటర్‌లో కనిపిస్తాయి. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఫోన్‍కు బైక్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని కాల్స్, ఎస్ఎంఎస్ అలెర్టులను పొందవచ్చు. యూఎస్‍బీ పోర్టు కూడా ఈ బైక్‍కు ఉంటుంది.

Hero Super Splendor XTEC Bike: ముందు వీల్‍కు డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఈ నయా బైక్‍కు అందుబాటులోకి వచ్చింది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్వర్లు, అలాయ్ వీల్‍లను ఈ బైక్ కలిగి ఉంది.

ఇంజిన్, పర్ఫార్మెన్స్

Hero Super Splendor XTEC Bike: 124.7cc BS6 ఇంజిన్‍ను ఈ సరికొత్త హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ కలిగి ఉంది. లీటర్ పెట్రోల్‍కు 68 కిలోమీటర్ల మైలేజ్‍ను ఈ బైక్ ఇస్తుందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. 7,500 rpm వద్ద 10.7 bhp, 6,000 rpm వద్ద 10.6 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ గేర్ బాక్స్, i3S స్టాప్-స్టార్ట్ సిస్టమ్‍ను ఈ 2023 సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ కలిగి ఉంది.

Hero Super Splendor XTEC Bike Price:ధర

ఈ నయా హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ బైక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.83,368 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.87,268 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.