తెలుగు న్యూస్  /  Business  /  Hdfc Life's New Insurance Plan Offers Guaranteed Income Of Upto 13% Annually

HDFC Life: 13% వరకు గ్యారెంటీడ్ ఇన్ కం; హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ కొత్త ప్లాన్

HT Telugu Desk HT Telugu

25 February 2023, 15:56 IST

  • HDFC Life: భారత్ లోని ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ (HDFC Life) కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ (insurance plan) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HDFC Life new plan: భారత్ లోని ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ (HDFC Life) హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ గ్యారెంటీడ్ ఇన్ కం ఇన్సూరెన్స్ ప్లాన్ (HDFC Life Guaranteed Income Insurance plan) పేరుతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ (insurance plan) ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ను ఆన్ లైన్ లో పర్చేజ్ చేసినవారికి ప్రీమియం పేమెంట్ టర్మ్ (premium payment term PPT) ల ఆధారంగా 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ (premium payment term PPT) 8 నుంచి 10 సంవత్సరాలుగా పెట్టుకున్నవారికి 12%, ప్రీమియం పేమెంట్ టర్మ్ (premium payment term PPT) 12 నుంచి 15 ఏళ్లు పెట్టుకున్నవారికి 15% డిస్కౌంట్ లభిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

Best Mutual Funds : ఏడాది కాలంలో అద్భుత రిటర్నులు ఇచ్చిన టాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..

Mahindra XUV 3XO : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వేరియంట్లు- వాటి ధరలు..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 155 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ ప్రాఫిట్స్​!

HDFC Life new guarantee income plan: గ్యారెంటీ ఇన్ కం

హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ (HDFC Life) నుంచి వచ్చిన ఈ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ (insurance plan) తో ఎస్యూర్డ్ సమ్ (sum assured) లో 11% నుంచి 13 % వరకు వార్షిక గ్యారెంటీ ఇన్ కం లభిస్తుంది. డెత్ బెనిఫిట్స్ తో పాటు కచ్చితమైన, క్రమం తప్పని, పన్ను మినహాయింపు లభించే వార్షిక ఆదాయం కోరుకునే వారికి HDFC Life Guaranteed Income Insurance plan సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ అని బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటెక్షన్, లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనే రెండు ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయని హెచ్ డీ ఎఫ్ సీ లైఫ్ (HDFC Life) ప్రొడక్ట్స్, సెగ్మెంట్స్ హెడ్ అనీశ్ ఖన్నా తెలిపారు. ఈ ప్లాన్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికి తొలి సంవత్సరం ప్రీమియంలో డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ (premium payment term PPT) 8 నుంచి 10 సంవత్సరాలుగా పెట్టుకున్నవారికి 12%, ప్రీమియం పేమెంట్ టర్మ్ (premium payment term PPT) 12 నుంచి 15 ఏళ్లు పెట్టుకున్నవారికి 15% డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ కం పీరియడ్స్ గా పాలసీ హోల్డర్ 8, 10, 12, 15, 20, 25, 20 సంవత్సరాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కాకుండా డెత్ బెనిఫిట్ గా ఇన్సూర్ చేసిన మొత్తం లభిస్తుంది. ఈ ప్లాన్ ను కొనుగోలు చేయడానికి జీరో నుంచి 65 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు అర్హులు. ఇది నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరన్స్ ప్లాన్ (non-participating life insurance plan) అన్న విషయం గుర్తుంచుకోవాలి.

టాపిక్