HDFC Life Q2 Results: లాభంలో 19 శాతం వృద్ధి కనబరిచిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్-hdfc life q2 results profit rises 19 percent to 326 crore rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Life Q2 Results: లాభంలో 19 శాతం వృద్ధి కనబరిచిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్

HDFC Life Q2 Results: లాభంలో 19 శాతం వృద్ధి కనబరిచిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 03:21 PM IST

HDFC Life Q2 Results: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రెండో త్రైమాసికంలో 19 శాతం లాభం కనబరిచింది.

లాభంలో 19 శాతం వృద్ధి నమోదు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్
లాభంలో 19 శాతం వృద్ధి నమోదు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ (MINT_PRINT)

HDFC Life Insurance q2 results: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో 19 శాతం పెరిగి రూ. 326.24 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.274.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 11443.96 నుంచి దాదాపు 15 శాతం పెరిగి ఈ త్రైమాసికంలో నికర ప్రీమియం ఆదాయం రూ. 1,3110.91 కోట్లకు చేరుకుంది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ సాల్వెన్సీ రేషియో ఇంతకుముందు 183 శాతం ఉండగా ఇప్పుడు 210 శాతంగా ఉంది.

‘మేం ఈ త్రైమాసికంలో పరిశ్రమకు అనుగుణంగా, లిస్టెడ్ కంపెనీల కంటే వేగంగా అభివృద్ధి చెందాం. ఇది క్యూ1లో 14.6% నుండి క్యూ2లో 15.0%కి మార్కెట్ షేర్ మెరుగుదలకు దారితీసింది..’ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పదాల్కర్ అన్నారు.

కంపెనీ కొత్త వ్యాపార ప్రీమియం గత ఏడాది రెండో త్రైమాసికంతో పోల్చితే 7 శాతం తగ్గి రూ. 6,147 కోట్లకు చేరుకుంది. అయితే కొత్త వ్యాపారపు విలువ రూ. 678 కోట్ల నుంచి 10.3 శాతం పెరిగి రూ. 748 కోట్లకు చేరుకుంది.

ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ (ఏపీఈ) 11 శాతం వృద్ధి చెందిందని కంపెనీ పేర్కొంది. ప్రథమార్థంలో కొత్త వ్యాపార మార్జిన్ 27.6 శాతంగా ఉంది.

WhatsApp channel