తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Deceptive Reviews In E-commerce: ఈ కామర్స్ సైట్లలో ఫేక్ రివ్యూలకు ఇక చెక్

Deceptive reviews in e-commerce: ఈ కామర్స్ సైట్లలో ఫేక్ రివ్యూలకు ఇక చెక్

HT Telugu Desk HT Telugu

23 November 2022, 18:31 IST

  • Deceptive reviews in e-commerce: ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల వంటి ఈ కామర్స్ సైట్లలో నకిలీ రివ్యూలను రాసే వినియోగదారులకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

Deceptive reviews in e-commerce: ఈ కామర్స్ సైట్లలో ఉత్పత్తుల గురించి నకిలీ రివ్యూలు రాసే వినియోగదారులు ఇకపై జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వారు ఇకపై మొదట కొన్నిషరతులను అంగీకరించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక నిబంధనావళిని సిద్ధం చేసింది. వినియోగదారులకు ఆన్ లైన్ లో ఉత్పత్తులను విక్రయించే అన్ని సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వినియగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ వెల్లడించారు.

Deceptive reviews in e-commerce: షరతులు వర్తిస్తాయి

ఈ కామర్స్ సైట్లలో రివ్యూలు రాసే వినియోగదారులు ముందుగా తమ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. వినియోగదారుల వ్యవహారాల్లో పారదర్శకత, నిజాయితీ, నిష్పక్షపాతం, ప్రైవసీ, భద్రతలను నెలకొల్పడానికి ఈ నిబంధనలను రూపొందించారు. రివ్యూ అడ్మినిస్ట్రేటర్ లకు ఈ కామర్స్ సంస్థలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. త్వరలో అన్ని ఈ కామర్స్ సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా ఆదేశాలివ్వనున్నారు. నిబంధనల్లో పేర్కొన్న ప్రమాణాలను ఉల్లంఘిస్తే. వినియోగదారులు కన్సూమర్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా సీసీపీఏ కు, వినియోగదారుల కమిషన్ కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారులు చేసే రివ్యూలను మొదట రివ్యూ అడ్మినిస్ట్రేటర్ పరిశీలించి, రివ్యూ చేసిన వ్యక్తి వివరాలను సరిపోల్చుకుని, ఆ తరువాత ఆ రివ్యూను పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

టాపిక్