తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rates Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‍న్యూస్.. తగ్గిన ధర.. వెండి మాత్రం

Gold Rates Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‍న్యూస్.. తగ్గిన ధర.. వెండి మాత్రం

16 November 2022, 6:03 IST

    • Gold Price Today November 16: బంగారం ధర నేడు దిగివచ్చింది. వెండి దిశ మాత్రం విభిన్న దిశలో ప్రయాణించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
నేటి బంగారం, వెండి, ప్లాటినం ధర వివరాలు
నేటి బంగారం, వెండి, ప్లాటినం ధర వివరాలు

నేటి బంగారం, వెండి, ప్లాటినం ధర వివరాలు

Gold and Silver Price Today in India: పసిడి కొనాలనుకుంటున్న వారికి తీపికబురు ఇది. కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు నేడు (నవంబర్ 16) తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.460 తగ్గింది. దీంతో భారత మార్కెట్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర బుధవారం రూ.47,800కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా కాస్త దిగివచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నేడు రూ.490 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.52,150కు వచ్చింది. వీటితో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి, ప్లాటినం ధరలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold Rate Today in Hyderabad: హైదరాబాద్‍లో ఇలా..

హైదరాబాద్ మార్కెట్‍లోనూ బంగారం ధరలు నేడు దిగివచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800కు చేరింది. 24 క్యారెట్ల (10 గ్రాములు) పసిడి రేట్ రూ.52,150గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

Gold Rate Today in India: ఇతర నగరాల్లో..

దేశంలోని ప్రధాన నగరాల్లోనూ నేడు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల (10 గ్రాములు) పసిడి రేటు రూ.47,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి వెల రూ.52,300కు దిగొచ్చింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ.52,150కు చేరింది. కోల్‍కతా, కేరళలోనూ ఇవే ధరలు ఉన్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,850గా ఉంది. చెన్నైలో దీని ధర రూ.49,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఆ నగరంలో రూ.53,890గా ఉంది.

Silver Prices Today: వెండి ఇలా..

భారత మార్కెట్లలో నేడు బంగారం ధరలు తగ్గగా.. వెండి స్వల్పంగా పెరిగింది. 100 గ్రాముల వెండి ధర రూ.100 పెరిగి రూ.6,270కు చేరింది. కిలో వెండి ధర రూ.62,700గా ఉంది.

హైదరాబాద్‍లో బుధవారం కిలో వెండి వెల రూ.68,500 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులోనూ ఇదే ధర ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700గా ఉంది. ముంబై, కోల్‍కతాలోనూ ఇదే ధర ఉంది.

Platinum prices: ప్లాటినం ధరలు

దేశంలో ప్లాటినం ధరలు స్థిరంగా కొనసాగాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.160 తగ్గింది. రూ.26,420కు చేరింది.

హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.26,420గానే ఉంది.