తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర: హైదరాబాద్‍లో తులం రేటు ఎంతంటే!

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర: హైదరాబాద్‍లో తులం రేటు ఎంతంటే!

23 May 2023, 5:32 IST

    • Gold Rate Today: దేశీయ మార్కెట్‍లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ సిటీల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
నేటి బంగారం ధరలు ఇలా..
నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

నేటి బంగారం ధరలు ఇలా..

Gold Rate Today: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో దేశీయ మార్కెట్‍లో పసిడి (Gold) రేటు స్వల్పంగా దిగొచ్చింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం రేటు మంగళవారం ఉదయానికి రూ.10 తగ్గి రూ.56,290కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.10 దిగొచ్చి రూ.61,410కి చేరింది. దేశీయ మార్కెట్‍లో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ సిటీల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold Rate Today: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.56,440గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి గోల్డ్ రేటు రూ.61,560కు దిగొచ్చింది.

హైదరాబాద్‍ సహా ఇతర నగరాల్లో..

Gold Rate today: హైదరాబాద్‍‍ మార్కెట్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,290కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.61,410కు దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold Price Today: బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,340కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.61,460గా ఉంది. అహ్మదాబాద్‍లోనూ ఇవే ధరలు నమోదయ్యాయి.

Gold Price Today: ముంబై, కోల్‍కతా నగరాల్లో 22 క్యారెట్లకు చెందిన ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.56,290కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ వెల రూ.61,410గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వెల రూ.56,750కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,950కు వెళ్లింది.

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా రుణాల పరిమితిపై నెలకొన్న సందిగ్ధతతో గోల్డ్ రేట్లు కూడా ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,970 వద్ద ట్రేడ్ అవుతోంది. ద్రవ్యోల్బణం, డాలర్ విలువ మార్పు సహా మరిన్ని అంశాలు బంగారం రేటుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

వెండి కూడా స్వల్పంగా..

Silver Rate Today: దేశీయ మార్కెట్‍లో వెండి (Silver) ధర కూడా స్వల్పంగా దిగొచ్చింది. కిలో వెండి ధర రూ.300 తగ్గి రూ.75,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైల్లో కిలో వెండి ధర రూ.78,600గా ఉంది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్‍ల్లో కిలో వెండి రేటు రూ.75,000గా ఉంది.

(గమనిక: ఈ ధరల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)