తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Silver Rate Today Rises Check Latest Prices

Gold Rate Today: పసిడి ధర మళ్లీ పైకి: నేటి రేట్లు ఇవే

22 March 2023, 6:06 IST

  • Gold Rate Today: పసిడి ధర మళ్లీ పెరిగింది. వెండి రేటు కూడా అధికమైంది. దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్, వెండి తాజా ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

నేటి బంగారం ధరలు ఇలా..
నేటి బంగారం ధరలు ఇలా.. (MINT_PRINT)

నేటి బంగారం ధరలు ఇలా..

Gold Rate Today: ఒక్క రోజు బ్రేక్ తర్వాత దేశీయ మార్కెట్‍లో బంగారం ధర మళ్లీ పెరిగింది. గోల్డ్ రేటు మళ్లీ పైకి ఎగిసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి బుధవారం ఉదయం నాటికి రూ.55,000కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.220 అధికమై రూ.60,000కు ఎగిసింది. మరోసారి కీలకమైన మార్కుకు పసిడి చేరింది. 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.6,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‍లో..

Gold Rate Today: హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. హైదరాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,000కు ఎగిసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.60,000కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో..

Gold Price Today in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.55,150కు పెరిగింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.60,150కు చేరింది. ముంబైలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.55,000, 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.60,000కు పెరిగింది. కోల్‍కతా, భువనేశ్వర్‌లోనూ ఇవే రేట్లు ఉన్నాయి.

Gold Rate Today: కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన తులం ఆర్నమెంట్ బంగారం ధర రూ.55,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,050కు పెరిగింది. అహ్మదాబాద్, పట్నాలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి. చెన్నైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.55,700కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.60,770కు పెరిగింది.

అంతర్జాతీయంగా డౌన్

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లో బంగారం ధర కాస్త తగ్గింది. 24 గంటల వ్యవధిలో స్పాట్ గోల్డ్ రేటు సుమారు 2 శాతం క్షీణించింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,943 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగ సంక్షోభం కొలిక్కి వస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో స్పాట్ గోల్డ్ కాస్త శాంతించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పసిడి ధరలో అధికంగా హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వెండి కూడా..

Silver Rate Today: బంగారాన్నే వెండి కూడా ఫాలో అయింది. సిల్వర్ ధర కూడా స్వల్పంగా అధికమైంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.72,100కు చేరింది. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైలో కిలో వెండి ధర రూ.74,700కు పెరిగింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‍, లక్నోలో కిలో సిల్వర్ రేటు రూ.72,100 వద్ద ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)