తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today In Telugu Check Latest Prices In Hyderabad 29 November 2022

Gold and silver rates today : స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

29 November 2022, 6:10 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 48,560గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,85,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 4,856గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Stocks to buy today : ఈ రూ. 98 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 52,980గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,29,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,298గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,710గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,140గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,560 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 52,980గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,470గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,970గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 48,560గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,980గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,560గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,980గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,610గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 53,030గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,560గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,980గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,140గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 తగ్గి.. రూ. 61,400కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 61,800గా ఉండేది.

Silver rates today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 68,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 61,400.. బెంగళూరులో రూ. 68,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం మరింత పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 తగ్గి.. రూ. 25,650కి చేరింది. ఆ ముందు రోజు ధర రూ. 25,740గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,650గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)