తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : భారీగా పతనమైన వెండి ధర.. దిగొచ్చిన పసిడి!

Gold and silver rates today : భారీగా పతనమైన వెండి ధర.. దిగొచ్చిన పసిడి!

Sharath Chitturi HT Telugu

26 May 2023, 5:35 IST

    • Gold and silver rates today : దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు కూడా దిగొచ్చాయి. పూర్తి వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 450 దిగొచ్చి.. రూ. 55,800కి చేరింది. గురువారం ఈ ధర రూ. 56,250గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4500 తగ్గి, రూ. 5,58,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,580గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 490 తగ్గి.. రూ. 60,870కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,360గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 4900 దిగొచ్చి.. రూ. 6,08,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,087గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,020గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,870గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,360గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,850గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,920గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,920గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,305గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1000 పతనమై.. రూ. 73,050కి చేరింది. గురువారం ఈ ధర రూ. 74,050గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,050.. బెంగళూరులో రూ. 76,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం భారీగా పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 740 తగ్గి.. రూ 27,220కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,960గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,220గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)