తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dividend Stock: భారీగా నాలుగో మధ్యంతర డివిడెండ్ ఇవ్వబోతున్న స్టాక్

Dividend stock: భారీగా నాలుగో మధ్యంతర డివిడెండ్ ఇవ్వబోతున్న స్టాక్

HT Telugu Desk HT Telugu

21 March 2023, 16:15 IST

  • ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (Hindustan Zinc Ltd) త్వరలో ఈ ఆర్థిక సంవత్సరంలో (FY23) నాలుగో మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించబోతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT)

ప్రతీకాత్మక చిత్రం

Dividend stock: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రకటించిన మూడు మధ్యంతర డివిడెండ్ల (interim dividend) ద్వారా మొత్తంగా రూ. 49.50 డివిడెండ్ ప్రకటించిన హిందుస్తాన్ జింక్ సంస్థ త్వరలో చివరి, నాలుగో మధ్యంతర డివిడెండ్ ప్రకటించబోతోంది.

Dividend stock: నాలుగో డివిడెండ్

అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో హిందుస్తాన్ జింక్ (Hindustan Zinc Ltd) షేర్ హోల్డర్లు మొత్తంగా 15.5% వరకు డివిడెండ్ ను పొందారు. తాజాగా, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మదుపర్లకు నాలుగో మధ్యంతర డివిడెండ్ (interim dividend) ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు రికార్డు డేట్ గా మార్చి 29వ తేదీని నిర్ణయించారు. డివిడెండ్ ఎంత ప్రకటించాలన్ని విషయాన్ని మార్చి 21వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయించనున్నారు.

Dividend stock: ఇప్పటివరకు ఎన్ని సార్లు..

గత సంవత్సరం జులై 22న తొలి మధ్యంతర డివిడెండ్ (interim dividend) ను హిందుస్తాన్ జింక్ (Hindustan Zinc Ltd) ప్రకటించింది. అప్పడు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 21 లను డివిడెండ్ గా పేర్కొంది. ఆ తరువాత 2022 నవంబర్ 23న రూ. 15.50 లను, అనంతరం 2023 జనవరి 30న రూ. 13 లను మధ్యంతర డివిడెండ్లుగా (interim dividend) ప్రకటించింది. అంటే, మూడు మధ్యంతర డివిడెండ్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై హిందుస్తాన్ జింక్ రూ. 49.5 లను షేర్ హోల్డర్ లకు అందించింది. హిందుస్తాన్ జింక్ (Hindustan Zinc Ltd) షేర్ వాల్యూ మంగళవారం, మార్చి 21న 0.06% తగ్గి 310.45 వద్ద ముగిసింది.