తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే

Sharath Chitturi HT Telugu

17 February 2023, 7:00 IST

    • Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై
స్టాక్స్​ టు బై (MINT_PRINT)

స్టాక్స్​ టు బై

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్​ మార్కెట్​లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 18,035 వద్ద ముగిసింది. 44 పాయింట్ల లాభంతో 61,319 వద్ద స్థిరపడింది బీఎస్​ఈ సెన్సెక్స్​. ఇక బ్యాంక్​ నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 41,631 వద్దకు చేరింది. స్మాల్​ క్యాప్​, మిడ్ ​క్యాప్​ సూచీలు 1శాతం కన్నా ఎక్కువ పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. డైలీ ఛార్ట్​లో నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. సరిగ్గా కీలకమైన రెసిస్టెన్స్​ వద్దే ఈ క్యాండిల్​ ఏర్పడింది. దీనిని వీక్​నెస్​గా పరిగణించవచ్చు. అయితే.. కన్ఫర్మేషన్​ మాత్రం రానున్న సెషన్స్​లో తెలుసుకోవాలి.

Stock market news : "నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గానే ఉంది. అయితే హయ్యర్​ హైస్​ వద్ద రెసిస్టెన్స్​ ఎదురైంది. 18,150- 18200 లెవల్స్​ కీలకం. అక్కడి నుంచి కింద పడితే.. షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా మారిందని అనుకోవచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​లోని రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1570.62కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు కూడా రూ. 1577.27కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

US Stock market investment in Telugu : వడ్డీ రేట్ల పెంపు తీవ్రతపై ఫెడ్​ అధికారులు చేసిన నెగిటివ్​ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా నష్టపోయాయి. డో జోన్స్​ 1.26శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.38శాతం, నాస్​డాక్​ 1.78శాతం పడ్డాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : దివీస్​ ల్యాబొరేటరీస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2821, టార్గెట్​ రూ. 2950

కోల్​ ఇండియా లిమిటెడ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 211, టార్గెట్​ రూ. 220- రూ. 224

మ్యాక్స్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఎంఎఫ్​ఎస్​ఎల్​):- బై రూ. 739, స్టాప్​ లాస్​ రూ. 723, టార్గెట్​ రూ. 769

సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- బై రూ. 27, స్టాప్​ లాస్​ రూ. 27.50, టార్గెట్​ రూ 29.50

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)