తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Stocks: ట్రేడర్స్ అలర్ట్.. నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే

Day Trading Stocks: ట్రేడర్స్ అలర్ట్.. నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే

16 March 2023, 7:11 IST

    • Day Trading Stocks: డే ట్రేడింగ్ చేసే వారు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే. అలాగే మార్కెట్లు నేడు ఊగిసలాటతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Day Trading Stocks: ట్రేడర్స్ అలర్ట్.. నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే
Day Trading Stocks: ట్రేడర్స్ అలర్ట్.. నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే

Day Trading Stocks: ట్రేడర్స్ అలర్ట్.. నేడు గమనించాల్సిన స్టాక్స్ ఇవే

Day Trading Guide 16 March 2023: భారత స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. బుధవారం సెషన్‍ను లాభాలతో ప్రారంభించిన సూచీలు.. చివరికి నష్టాలతోనే ముగిశాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 344.29 పాయింట్లు కోల్పోయి 57,555.90 వద్దకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 71.15 పాయింట్లు నష్టపోయి 16,972.15 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 359.90 పాయింట్లు క్షీణించి 39,051.50కు క్షీణించింది. అమెరికా సహా అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంపై మరింత ఆందోళన రేకెత్తుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్, నేడు (మార్చి 16, గురువారం) స్టాక్ మార్కెట్ల ఓపెనింగ్ ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకోండి.

ఎస్‍జీఎక్స్ నిఫ్టీ

SGX Nifty: ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రకారం నేడు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‍గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్ల ప్లస్‍లో ఉంది. మరోవైపు బుధవారం సెషన్‍ను అమెరికా మార్కెట్లు నష్టాలతోనే ముగించాయి. ఇది కూడా ప్రతికూలంగా కనిపిస్తోంది.

షార్ట్ టర్మ్‌ ట్రెండ్‍లో నిఫ్టీ వీక్‍గానే కొనసాగే అవకాశం ఉందని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి చెప్పారు. 16,900 నుంచి 16,800 మధ్య షార్ట్ టర్మ్‌లో కాస్త పుంజుకోవచ్చని విశ్లేషించారు. ఓవర్ సోల్డ్ జోన్‍లో ఉండడమే ఇందుకు కారణమని అన్నారు. నిఫ్టీకి పైకి వెళితే తక్షణ రెసిస్టెన్స్ 17,200 లెవెల్స్ వద్ద ఉందని చెప్పారు. బ్యాంక్ నిఫ్టీ తీరు కూడా నెగెటివ్‍గానే ఉందని 5పైసా.కామ్ లీడ్ రీసెర్చర్ రుచిత్ జైన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన కిందిస్థాయి సపోర్టును కూడా బ్యాంక్ నిఫ్టీ సూచీ బ్రేక్ చేసిందని చెప్పారు.

Day Trading Stocks: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ లిస్ట్

ఏషియన్ పెయింట్స్: బై అట్ రూ.2,827, టార్గెట్: రూ.2900, స్టాప్ లాస్: రూ.2,790

జిందాల్ స్టీల్: బై అట్ రూ.580, టార్గెట్: రూ.607, స్టాప్ లాస్: రూ.570

ఆప్‍టెక్: బై అట్ రూ.321, టార్గెట్: రూ.333, స్టాప్ లాస్: రూ.315

గ్లెన్‍మార్క్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.445 నుంచి రూ.450, స్టాప్ లాస్: రూ.415

టాటా స్టీల్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.113, స్టాప్ లాస్: రూ.104

పవర్ గ్రిడ్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.238, స్టాప్ లాస్: రూ.222

ఐటీసీ: బై అట్ రూ.389, టార్గెట్: రూ.398, స్టాప్ లాస్: రూ.372

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)