తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Suisse Shares Dive: కష్టాల్లో బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ సూయిస్

Credit Suisse shares dive: కష్టాల్లో బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ సూయిస్

HT Telugu Desk HT Telugu

03 October 2022, 16:13 IST

    • బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ సూయిస్ షేర్లు భారీగా నష్టపోయాయి.
స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్
స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ (REUTERS)

స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్

కుంభకోణంతో సతమతమవుతున్న స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం తన ఆర్థిక ఆరోగ్యంపై ఆందోళనలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నందున క్రెడిట్ సూయిస్‌లో షేర్లు సోమవారం కొత్త కనిష్టానికి పడిపోయాయి.

ట్రేడింగ్ ప్రారంభంలో బ్యాంక్ స్టాక్ ధర దాదాపు 10 శాతం క్షీణించి 3.58 స్విస్ ఫ్రాంక్‌లకు (3.61 డాలర్లకు) పడిపోయింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వారాంతంలో పెద్ద ఖాతాదారులకు, పెట్టుబడిదారులకు బ్యాంకు ద్రవ్యత, మూలధన స్థితి గురించి, దాని ఆర్థిక బలం గురించి భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు.

Credit Suisse చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉల్‌రిక్ కోయెర్నర్ శుక్రవారం సిబ్బందికి వారి ఆందోళనలను తగ్గించడానికి అంతర్గత సందేశాన్ని పంపారు. బ్యాంక్ గురించి ‘అనేక వాస్తవికంగా సరికాని ప్రకటనలు చేస్తున్నారు’ అని చెప్పారు.

‘రోజువారీ స్టాక్ ధర పనితీరు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడం లేదని నేను విశ్వసిస్తున్నాను’ అని కోయర్నర్ చెప్పారు.

కోయెర్నర్ ఆగస్టు ప్రారంభంలో క్రెడిట్ సూయిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దానిని పునరుద్ధరించే బృహత్తర పని స్వీకరించారు. అతను అక్టోబర్ 27న పరివర్తన ప్రణాళికలను సమర్పించాల్సి ఉంది.

బ్రిటీష్ ఆర్థిక సంస్థ గ్రీన్‌సిల్ పతనంతో బ్యాంకు కుదేలైంది. దీనిలో నాలుగు ఫండ్‌ల ద్వారా దాదాపు 10 బిలియన్‌ డాలర్లు జమ చేశారు.

అక్టోబర్‌లో మొజాంబిక్‌లోని ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు రుణాలు ఇచ్చినందుకు యూఎస్, బ్రిటిష్ అధికారులు $475 మిలియన్ జరిమానా విధించారు. మార్చి 2021 నుండి బ్యాంక్ షేర్లు వాటి విలువలో 70 శాతం నష్టపోయాయి. గత వారం ఒక వెల్త్ మేనెజ్‌మెంట్ ఫోరమ్‌లో "రైజింగ్ లైక్ ఎ ఫీనిక్స్" అనే థీమ్‌పై మాట్లాడినట్లు సిబ్బందికి పంపిన సందేశంలో కోయెర్నర్ పేర్కొన్నారు.

‘మనం ఏమి సాధించాలనుకుంటున్నాం అనేదానికి ఇది సముచితమైన రూపకం. నేను మా సహోద్యోగులకు చెప్పినట్లుగా, మేం దీర్ఘకాలిక, స్థిరమైన భవిష్యత్తు కోసం క్రెడిట్ సూయిస్‌ను పునర్నిర్మించే ప్రక్రియలో ఉన్నాం..’ అని తన సందేశంలో పేర్కొన్నారు.