తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 470 స్టాక్​తో భారీ లాభాలు..!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 470 స్టాక్​తో భారీ లాభాలు..!

Sharath Chitturi HT Telugu

07 May 2024, 8:15 IST

    • Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై టుడై..
స్టాక్స్​ టు బై టుడై..

స్టాక్స్​ టు బై టుడై..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 17 పాయింట్లు పెరిగి 73,896 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 33 పాయింట్లు కోల్పోయి 22,442 వద్ద ముగిసింది. ఇక 28 పాయింట్ల నష్టంతో బ్యాంక్​ నిఫ్టీ.. 48,895 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా ఉంది. 22,300 లెవల్స్​ దగ్గర సపోర్ట్​ ఉంది. అది దాటితే పాజిటివ్​ మూమెంట్​ కనిపించే అవకాశం ఉందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2169 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7812 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

Stock market news today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.46శాతం, నాస్​డాక్​ 1.19శాతం మేర లాభపడ్డాయి. ఎస్​ అండ్​ పీ 500 1.03శాతం లాభాల్లో ముగిసింది.

ఇదీ చూడండి:- Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

స్టాక్స్​ టు బై..

బాలకృష్ణ ఇండస్ట్రీస్​:- బై రూ. 2465, స్టాప్​ లాస్​ రూ. 2398, టార్గెట్​ రూ. 2610

బ్రిగేడ్​ ఎంటర్​ప్రైజెస్​:- బై రూ. 1110, స్టాప్​ లాస్​ రూ. 1077, టార్గెట్​ రూ. 1166

కోల్​ ఇండియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 430, టార్గెట్​ రూ. 430

జుబీలియెంట్​ ఫుడ్​:- బై రూ. 473- రూ. 474, స్టాప్​ లాస్​ రూ. 467, టార్గెట్​ రూ. 485

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం