తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Market Strategy: ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే స్టాక్​ మార్కెట్​లో లాభాలు!

2024 Market Strategy: ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే స్టాక్​ మార్కెట్​లో లాభాలు!

Sharath Chitturi HT Telugu

25 December 2023, 10:15 IST

google News
  • 2024 Market Strategy : 2023లో స్టాక్​ మార్కెట్​ బాగా రాణించాయి. మరి 2024లో పరిస్థితేంటి? ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే మంచి లాభాలు వస్తాయి? అన్న విషయాలను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే స్టాక్​ మార్కెట్​లో లాభాలు!
ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే స్టాక్​ మార్కెట్​లో లాభాలు! (Pixabay)

ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే స్టాక్​ మార్కెట్​లో లాభాలు!

2024 Market Strategy : దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. రెండంకెల వృద్ధితో 2023ని ముగించనున్నాయి. వరుసగా 8వ ఏడాది.. సానుకూల రిటర్నులు ఇచ్చాయి దేశీయ సూచీలు. అంచనాలను తలకిందులు చేస్తూ.. సూచీలు ఈ ఏడాది నూతన గరిష్ఠాలను తాకడం విశేషం. అయితే.. 2024లో మార్కెట్​లను ప్రభావితం చేసే ఈవెంట్లు చాలా ఉన్నాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు స్టాక్​ మార్కెట్​ నిపుణులు.

2023లో ఇలా..

నిఫ్టీ 18 శాతం లాభాలతో 21,593 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ప్రపంచ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న చమురు ధరలు, యుఎస్ 10 ఇయర్​ బాండ్​ యూల్డ్​ గరిష్ఠ స్థాయిని తాకడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. భారత మార్కెట్ చారిత్రక మైలురాయికి చేరుకోవడం విశేషం.

2024లో ఇన్వెస్టర్లు ఇలా చేయాలి..!

Stock market outlook 2024 : ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎఫ్​ఐఐలు ఎక్కువగా ఇన్​వెస్ట్​ చేయడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖ పట్టడం, మాక్రో ఎకనామిక్స్​ డేటా మెరుగుపడటం, రేట్​ హైక్​ లేకపోవడంతో పాటు రేట్​ కట్స్​పై ఆశలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంచనాల మధ్య ఇండియా స్టాక్​ మార్కెట్​లో సానుకూల సెంటిమెంట్​ నెలకొంది.

అయితే.. రాబోయే ఏడాదిలో మదుపర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

"నిర్దిష్ట రంగాలకు "దూరంగా ఉండండి" అని చెప్పినా, దానిని పాటించడం కష్టమే. కానీ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్​లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్​ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి. ప్రస్తుత వాల్యుయేషన్ల ఆధారంగా అవి సురక్షితంగా కనిపిస్తాయి. కాబట్టి స్వల్పకాలికంగా లార్జ్ క్యాప్స్ వైపు నిధులను మళ్లించండి. ఇక మదుపర్లు పెట్టుబడి పెట్టే ముందు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్​లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఇప్పటికే చాలా పెరిగిపోయాయి," అని ట్రేడ్​జీనీ సీఓఓ త్రివేశ్​ డీ తెలిపారు.

Stock market news today : “వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​ కదలికలను సరిగ్గా అంచనా వేయడం కష్టం. అలాగే, బడ్జెట్ సమయంలో ఏ రంగమైనా ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలను చూడవచ్చు. కాబట్టి, ఆ సమయంలో అత్యంత అస్థిర రంగాలకు దూరంగా ఉండటం మంచిది. బడ్జెట్ బయటకు వచ్చి, దానిని మీరు విశ్లేషణ చేసిన తర్వాతే, పెట్టుబడి పెట్టండి,” అని త్రివేశ్​ డీ తెలిపారు.

ఆ స్టాక్స్​తో జాగ్రత్త..!

“సరైన బిజినెస్​ లేని, కార్పొరేట్​ గవర్నెన్స్​ విషయంలో నిత్యం సమస్యలు ఎదుర్కొనే సంస్థలకు దూరంగా ఉండండి. క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశించే ముందు వాల్యుయేషన్లు, రిస్క్-రివార్డు రేషియోను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. మార్కెట్లు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో, రిస్క్- రివార్డ్​ని చూసి.. అవసరాలకు అనుగుణంగా అసెట్స్​ని కేటాయించుకోవాలి. ఇప్పటికే ఉన్న ఇన్​వెస్ట్​మెంట్స్​ని రీబ్యాలెన్స్​ చేసుకోవాలి. అలాగే, స్టాక్ ఎంపికలో జాగ్రత్త వహించడం, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న హై క్వాలిటీ కంపెనీలపై మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం,” అని యెస్​ సెక్యూరిటీస్​ ఇండియా ఎండీ- సీఈఓ అన్షుల్​ అర్జారే తెలిపారు.

Best strategy for stock market investment : “ వాల్యుయేషన్స్​కు సంబంధమే లేకుండా.. పెరిగిపోయిన స్మాల్​ క్యాప్​ స్టాక్స్​తో జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఎంఈ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే వాటిలో చాలా వరకు ఐపిఓల సమయంలోనే అధిక ధర కలిగి ఉంటాయి. అంతేకాకుండా.. సాధారణంగా కొన్ని నెలల ట్రేడింగ్​లోనే వాటి లిస్టింగ్ స్థాయి కంటే దిగువకు పడిపోతాయి. వచ్చే ఏడాది లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అస్థిరత ఊపందుకోవడం మొదలుపెడితే ఈ రెండు గ్రూపుల్లో కరెక్షన్స్​ స్పష్టంగా కనిపిస్తాయి," అని సామ్​కో సెక్యూరిటీస్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ పారుల్​ శర్మ అభిప్రాయపడ్డారు.

“వచ్చే ఏడాదిలో చాలా రంగాలు సానుకూలంగా ఉంటాయని అంచనా వేసినప్పటికీ, రాబోయే నెలల్లో మెటల్​ స్పేస్​కి దూరంగా ఉండటం మంచిది. రానున్న నెలల్లో ఇవి కన్సాలిడేట్​ అవ్వొచ్చు. ఇయర్లీ ఛార్ట్​లో 'హ్యాంగిగ్​ మ్యాన్​' నమూనా ఏర్పడింది. 2024లో కరెక్షన్​, కన్సాలిడేషన్​ కనిపించొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన రూపక్​ దే తెలిపారు.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం