Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..
Kotak Bank Q4 results: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY24) ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ క్యూ 4 లో కొటక్ బ్యాంక్ 18% వృద్ధితో రూ. 4,133 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
Kotak Mahindra Bank Q4 results: ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ నికర లాభం రూ.4,133 కోట్లు అని ప్రకటించింది. ఇది గత సంవత్సరం క్యూ 4 తో పోలిస్తే 18 శాతం వృద్ధి అని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23)లో కోటక్ బ్యాంక్ రూ.3,496 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
మొత్తం ఆదాయం 13.78 వేల కోట్లు..
2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY24) లో కొటక్ మహింద్ర మొత్తం ఆదాయం రూ.15,285 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది రూ.12,007 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే, కొటక్ మహింద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,939 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 26 శాతం పెరిగి రూ.13,782 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ మొత్తం ఆదాయం 2022-23లో రూ.41,334 కోట్లు కాగా, అది 2023-24 లో రూ.56,072 కోట్లకు పెరిగింది.
నికర వడ్డీ ఆదాయం
నికర వడ్డీ ఆదాయం విషయానికి వస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ (Kotak Mahindra Bank) నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.25,993 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అది రూ.21,552 కోట్లుగా ఉంది. 2024 మార్చితో ముగిసే త్రైమాసికంలో ఈ ఎన్ఐఐ రూ.6,909 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 4 లో అది రూ.6,103 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 13 శాతం వృద్ధి.