తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo Y18 Launch : వివో నుంచి రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Vivo Y18 launch : వివో నుంచి రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

07 May 2024, 8:50 IST

  • Vivo Y18 price : వివో తన నూతన వివో వై18, వివో వై18ఈ స్మార్ట్​ఫోన్లను మీడియాటెక్ హీలియో ప్రాసెసర్లతో విడుదల చేసింది. వాటి ధరలు, లభ్యత, స్పెసిఫికేషన్లతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వై18, వివో వై18ఈ లాంచ్​..
వివో వై18, వివో వై18ఈ లాంచ్​.. (Amazon)

వివో వై18, వివో వై18ఈ లాంచ్​..

Vivo Y18E price : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో వరుస లాంచ్​లతో వివో సంస్థ మంచి జోరు మీద ఉంది! తాజాగా మరో రెండు స్మార్ట్​ఫోన్స్​ని లాంచ్​ చేసింది. అవి.. వివో వై18, వివో వై18ఈ. ఇవి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​గా వచ్చాయి. ఈ స్మార్ట్​ఫోన్స్​లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. డ్యూయెల్ రియర్ కెమెరాలు, విలక్షణమైన వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న ఈ రెండు డివైజ్​లు.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత యూఐతో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండు గ్యాడ్జెట్స్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వై18, వివో వై18ఈ: ధర, లభ్యత

వివో వై18 రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.9,999. ఇది జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వివో వై18ఈ స్మార్ట్​ఫోన్​లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. 

ఈ రెండు మోడళ్లను వివో ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వివో వై18, వివో వై18ఈ : స్పెసిఫికేషన్లు..

Vivo Y18 features : వివో వై18, వివో వై18ఈ స్పెసిఫికేషన్లు 6.56 ఇంచ్​ హెచ్ డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పిక్సల్ డెన్సిటీ ఉన్నాయి. 12 ఎన్ఎమ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి 85 ఎస్ఓసి, 4 జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్, 128 జీబీ వరకు ఇఎంఎంసీ 5.1 ఇన్​-బిల్ట్​ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టెంపై పనిచేసే ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్లు స్మూత్ యూజర్ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తాయి.

ఇదీ చూడండి:- Motorola Edge 50 Ultra : త్వరలో మోటోరోలా ఎడ్జ్​ 50 అల్ట్రా లాంచ్​.. ఫీచర్స్​ ఇవేనా?

కెమెరా విభాగంలో, వివో వై 18 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్​తో పాటు 0.08 మెగాపిక్సెల్ సెన్సార్, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. వై18ఈ స్మార్ట్​ఫోన్స్​లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Best Budget friendly smartphones : ఈ రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో స్మార్ట్​ఫోన్స్​లో 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి ఐపి 54 రేటింగ్​తో కూడిన వాట్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​తో వస్తున్నాయి.

కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యుఎస్బీ టైప్-సీ ఉన్నాయి. మెజర్మెంట్స్​ విషయానికొస్తే.. ఈ రెండు మోడళ్లు 163.63 x 75.58 x 8.39 మిమీ మరియు బరువు 185 గ్రాములు.

తదుపరి వ్యాసం