తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card Vs Debit Card : క్రెడిట్​ కార్డ్​- డెబిట్​ కార్డ్​ మధ్య వ్యత్యాసం ఏంటి?

Credit card vs debit card : క్రెడిట్​ కార్డ్​- డెబిట్​ కార్డ్​ మధ్య వ్యత్యాసం ఏంటి?

Sharath Chitturi HT Telugu

28 February 2023, 16:48 IST

    • Credit card vs debit card difference : మీరు ఓ క్రెడిట్​ కార్డ్​ తీసుకుందామని చూస్తున్నారా? క్రెడిట్​ కార్డ్​, డెబిట్​ కార్డ్​ల మధ్య వ్యత్యాసం మీకు తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే..
క్రెడిట్​ కార్డ్​- డెబిట్​ కార్డ్​ మధ్య వ్యత్యాసం ఏంటి?
క్రెడిట్​ కార్డ్​- డెబిట్​ కార్డ్​ మధ్య వ్యత్యాసం ఏంటి? (REUTERS)

క్రెడిట్​ కార్డ్​- డెబిట్​ కార్డ్​ మధ్య వ్యత్యాసం ఏంటి?

Credit card vs debit card difference : క్రెడిట్​ కార్డ్​, డెబిట్​ కార్డ్​లను పేమెంట్స్​ కోసం వినియోగిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ రెండింటికీ 16 డిజిట్​ నెంబర్స్​, ఎక్స్​పైరీ డేట్​, సీవీవీ కోడ్స్​, ఈఎంవీ చిప్స్​ వంటివి ఉంటాయి. అయితే.. ఈ రెండింటి మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

డెబిట్​ కార్డ్​ అంటే ఏంటి..?

మీరు సేవింగ్స్​ అకౌంట్​ ఓపెన్​ చేస్తే.. సంబంధిత బ్యాంక్​ మీకు డెబిట్​ కార్డ్​ ఇస్తుంది. ఇది బ్యాంక్​ అకౌంట్​తో లింకై ఉంటుంది. ఫలితంగా.. అందులోని నిధులను డెబిట్​ కార్డ్​ ద్వారా ఉపయోగించుకోవచ్చు. పేమెంట్​ చేసినప్పుడు, నిధులు డైరక్ట్​గా బ్యాంక్​ అకౌంట్​ నుంచి కట్​ అవుతాయి. బ్యాంక్​కు సంబంధించిన ఏటీఎం నుంచి క్యాష్​ డ్రా చేస్తే.. ఎలాంటి ట్రాన్సాక్షన్​, విత్​డ్రా ఫీజ్​లు ఉండవు. అయితే.. వీటిల్లో డెయిలీ స్పెండింగ్​, విత్​డ్రా లిమిట్స్​ ఉంటాయి.

క్రెడిట్​ కార్డ్​ అంటే ఏంటి..?

Credit card vs debit card : 'బై నౌ పే లేటర్​'(ఇప్పుడు కొను, తర్వాత కట్టు)కు చక్కటి ఉదాహరణ ఈ క్రెడిట్​ కార్డ్​. వీటిని బ్యాంక్​లు, ఎన్​బీఎఫ్​సీలు ఇష్యూ చేస్తుంటాయి. మీ దగ్గర సమయానికి నగదు లేకపోతే.. క్రెడిట్​ కార్డ్​ ద్వారా ట్రాన్సాక్షన్​ చేసుకోవచ్చు. కొంత కాలానికి డ్యూ డేట్​ పడుతుంది. ఆలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ క్రెడిట్​ లిమిట్స్​ ఉంటాయి. ఇది ఒక్కో బ్యాంక్​కు ఒక్కో విధంగా ఉంటుంది.

క్రెడిట్​ కార్డ్​ వర్సెస్​ డెబిట్​ కార్డ్​..

మీ క్రెడిట్​ స్కోరు, బ్యాంక్​తో మీకున్న సంబంధం వంటి అంశాలపై మీ నెలవారీ క్రెడిట్​ కార్డ్​ లిమిట్​ ఆధారపడి ఉంటుంది. డెబిట్​ కార్డ్​కు అలా ఏమీ ఉండదు. మీ రోజువారీ ట్రాన్సాక్షన్స్​ సులభంగా చేసుకోవచ్చు.

Credit card usage : డెబిట్​ కార్డ్​ నుంచి మీరు మీ డబ్బులను విత్​డ్రా చేసుకుంటారు. కానీ క్రెడిట్​ కార్డ్​లో అలా కాదు. క్రెడిట్​ కార్డ్​ స్వైప్​ చేస్తుంటే.. మీరు అప్పు చేస్తున్నట్టే! ఫలితంగా మీపై వడ్డీ భారం పడుతుంది. దీనితో పాటు ట్రాన్సాక్షన్​ ఫీజ్​ వంటివి కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంట్రెస్ట్​- ఫ్రీ క్రెడిట్​ కూడా మీకు లభించవచ్చు.

కొన్ని క్రెడిట్​ కార్డ్స్​లో యాన్యువెల్​ ఫీజ్​ ఉంటుంది. ఇంకొన్నింట్లో ఉండదు. ఇక ఫీజ్​ ఉన్న వాటిలో నిర్దేశించిన నగదు ఖర్చు చేస్తే ఫీజ్​ పడదు. డెబిట్​ కార్డ్​కు రెనెవెల్​ ఫీజ్​, యాన్యువల్​ ఫీజ్​లు ఉండొచ్చు.

క్రెడిట్​ కార్డ్స్​లో అనేక ఉపయోగాలు ఉంటాయి. క్యాష్​బ్యాక్​, డిస్కౌంట్స్​ రివార్డ్స్​ వంటివి లభిస్తుంటాయి. డెబిట్​ కార్డ్స్​లో ఇలాంటివి చాలా తక్కువ.

Debit card usage : డెబిట్​ కార్డ్​, క్రెడిట్​ కార్డ్​ వినియోగంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. దుకాణాలు, సినిమా హాల్స్​, షాపింగ్​ మాల్స్​.. ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.

డెబిట్​ కార్డ్​కి ఎలిజిబులిటీ వంటివి ఉండవు! బ్యాంక్​లో అకౌంట్​ ఓపెన్​ అయితే చాలు. కానీ క్రెడిట్​ కార్డ్​లకు ఎలిజిబులిటీ ఉంటుంది. మీ ఉద్యోగం, జీతం, సేవింగ్స్​ వంటి అంశాల ఆధారంగా మీకు కార్డ్​ వస్తుంది.

Credit card vs debit card which is better : క్రెడిట్​ కార్డ్స్​లో జీరో లయబులిటీ ఇన్​ష్యూరెన్స్​ ఉంటుంది. కార్డ్స్​ ఎప్పుడైనా మిస్​ అయితే ఇది ఉపయోగపడుతుంది. కానీ డెబిట్​ కార్డ్​లకు ఇది ఉండదు.