How to link credit card to UPI : క్రెడిట్​ కార్డును యూపీఐకి లింక్​ చేయడం ఎలా?-how to link credit card to upi know all the detailed step here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Link Credit Card To Upi : Know All The Detailed Step Here

How to link credit card to UPI : క్రెడిట్​ కార్డును యూపీఐకి లింక్​ చేయడం ఎలా?

Sharath Chitturi HT Telugu
Feb 17, 2023 11:06 AM IST

How to link credit card to UPI : మీ క్రెడిట్​ కార్డ్​ను యూపీఐకి లింక్​ చేయాలని చూస్తున్నారా? ఆ ప్రక్రియ మీకు తెలియడం లేదా? అయితే ఈ కథనం మీకోసమే..

యూపీఐతో క్రెడిట్​ కార్డును ఎలా లింక్​ చేయాలి?
యూపీఐతో క్రెడిట్​ కార్డును ఎలా లింక్​ చేయాలి?

How to link credit card to UPI : దేశంలో ప్రతి నెలా రికార్డుస్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్​లు అవుతున్నాయి. ఇప్పుడందరు యూపీఐ ద్వారానే పేమెంట్స్​ చేసేందుకు ఇష్టపడుతున్నారు. చాలా సులభంగా లావాదేవీలు జరిగిపోతుండటం ఇందుకు ముఖ్య కారణం. ఇప్పటివరకు డెబిట్​ కార్డ్​లనే లింక్​ చేసే వెసులుబాటు ఉండేది. ఇక ఇప్పుడు క్రెడిట్​ కార్డ్​లను కూడా యూపీఐకి లింక్​ చేసేందుకు ఆర్​బీఐ అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్​ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​.. తమ కస్టమర్లకు గుడ్​ న్యూస్​ చేప్పింది. రూపే క్రెడిట్​ కార్డ్​తో యూపీఐ సేవలు ప్రారంభించినట్టు పేర్కొంది. ఫలితంగా ఈ సేవలు అందిస్తున్న.. దేశంలోనే తొలి ప్రైవేట్​ బ్యాంక్​గా నిలిచింది. ఇప్పుడిక హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రూపే క్రెడిట్​ కార్డ్​ను యూపీఐ ఐడీతో లింక్​ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​తో పాటు ఇండియన్​ బ్యాంక్​, యూనియన్​ బ్యాంక్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లు ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. యూపీఐ ఐడీతో క్రెడిట్​ కార్డ్​లను లింక్​ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాము..

క్రెడిట్​ కార్డును యూపీఐకి లింక్​ చేయడం ఎలా?

HDFC bank credit card UPI services : స్టెప్​ 1:- ముందుగా మీ యూపీఐ యాప్​ ఓపెన్​ చేయండి.

స్టెప్​ 2:- బ్యాంక్​ అకౌంట్స్​ సెక్షన్​కు వెళ్లండి.

స్టెప్​ 3:- క్రెడిట్​ కార్డ్​ ఆప్షన్​ సెలక్ట్​ చేయండి.

స్టెప్​ 4:- మీ బ్యాంక్​ అకౌంట్​ పేరు మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 5:- సంబంధిత బ్యాంక్​కు చెందిన క్రెడిట్​ కార్డ్స్​ డిస్​ప్లే అవుతాయి.

స్టెప్​ 6:- కార్డ్​ సెలక్ట్​ చేసి, కన్ఫర్మ్​ చేయండి.

స్టెప్​ 7:- సెలక్ట్​ చేసిన కార్డ్​కు యూపీఐ పిన్​ సెటప్​ చేయండి. అప్పుడు మీ కార్డ్​ యాడ్​ అవుతుంది. మీరు ఇక క్రెడిట్​ కార్డ్​ను యూపీఐతో ఉపయోగించుకోవచ్చు.

(యూపీఐతో క్రెడిట్​ కార్డ్​ను లింక్​ చేసేందుకు ఇది సాధారణ ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో బ్యాంక్​ల బట్టి ఈ ప్రక్రియ మారే అవకాశం ఉంది.)

జాగ్రత్తగా ఖర్చు చేయండి..!

Credit card UPI payment : డెబిట్​ కార్డ్​ను యూపీఐకి లింక్​ చేయడం వేరు.. క్రెడిట్​ కార్డ్​ను లింక్​ చేయడం వేరు! ఫోన్​లో సింగిల్​ క్లిక్​తో ఇప్పుడు డబ్బులు ఖర్చు చేసేయవచ్చు. ఇక క్రెడిట్​ కార్డ్​లను మితిమీరి ఖర్చు చేస్తే.. ఆ తర్వాత మనమే కష్టపడాలి. క్రెడిట్​ స్కోరు దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

WhatsApp channel