తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cars Discontinued In 2022 : ఈ ఏడాది.. ఇండియా మార్కెట్​లో నుంచి మాయమైపోయిన కార్లు ఇవే!

Cars discontinued in 2022 : ఈ ఏడాది.. ఇండియా మార్కెట్​లో నుంచి మాయమైపోయిన కార్లు ఇవే!

25 December 2022, 19:10 IST

google News
    • List of cars discontinued in 2022 in India : 2022లో చాలా కార్లు డిస్కంటిన్యూ అయిపోయాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము.
వోక్స్​వ్యాగన్​ పోలో
వోక్స్​వ్యాగన్​ పోలో

వోక్స్​వ్యాగన్​ పోలో

List of cars discontinued in 2022 in India : 2022లో కొత్త లాంచ్​లు, ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లతో ఆటో పరిశ్రమ కళకళలాడిపోయింది. కొత్త మోడల్స్​ రాకతో పాత వర్షెన్​లకు డిమాండ్​ తగ్గిపోయింది. ఈ క్రమంలో ఎన్నో సంస్థలు పలు మోడల్స్​ను డిస్కంటిన్యూ కూడా చేసేశాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మోడల్స్​ కూడా ఈ లిస్ట్​లో ఉన్నాయి. 2022లో ఇండియా రోడ్ల మీద మాయమైపోయిన కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము..

మారుతీ ఎస్​-క్రాస్​..

Maruti S cross discontinued : గ్రాండ్​ విటారా ఎంట్రీతో ఎస్​-క్రాస్​కు గుడ్​ బై చెప్పేసింది మారుతీ. ఈ ఎస్​-క్రాస్​.. ఎస్​యూవీ కన్నా క్రాసోవర్​గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి ఓ పెద్ద హ్యాచ్​బ్యాక్​ మోడల్​గా ఇది కనిపించేది. 2015లో ఇండియా మార్కెట్​లోకి లాంచ్​ అయ్యింది ఈ మారుతీ ఎస్​-క్రాస్​. 1.3 లీటర్​, 1.6 లీటర్​ డీజిల్​ ఇంజిన్స్​ ఉండేవి. కొంత కాలానికి 1.6 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ను నిలిపివేసింది ఆ సంస్థ. ఈ వెహికిల్​కి చాలా ఫేస్​లిఫ్ట్​ , అప్​గ్రేడ్​ వర్షెన్స్​ కూడా వచ్చాయి. ఈ ఏడాదిలో ఎస్​- క్రాస్​ మొత్తానికే డిస్కంటిన్యూ అయిపోయింది. అంతకుముందు.. దీని ధర రూ. 8.95లక్షలు- 12.92లక్షల మధ్యలో ఉండేది.

వోక్స్​వ్యాగన్​ పోలో..

Volkswagen Polo discontinued : ఇండియాలో 2010లో లాంచ్​ అయిన వోక్స్​వ్యాగన్​ పోలోకు మంచి డిమాండ్​ కనిపించింది. ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​లో పోలో ప్రసిద్ధి చెందింది. 12ఏళ్ల పాటు ఎన్నో అప్​గ్రేడ్స్​ కూడా పొందింది. చౌకైన ధరలో ప్రీమియం ఫీచర్స్​లో అందుబాటులో ఉన్న వెహికిల్​గా ఇది గుర్తింపు పొందింది. ఇందులో 1లీటర్​ టర్బో-పెట్రోల్​ టీఎస్​ఐ ఎంటీ/ఏటీ వేరియంట్​ ఇంజిన్​ ఉండేది. డిస్కంటిన్యూకు ముందు దీని ధర రూ. 6.45లక్షలు- రూ. 10.25లక్షల మధ్యలో ఉండేది.

అయితే.. భవిష్యత్తులో సరికొత్త అవతారంలో వోక్స్​వ్యాగన్​ పోలోను ఆ సంస్థ మళ్లీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

వోక్స్​వ్యాగన్​ వెంటో..

Volkswagen Vento : పోలోకు సెడాన్​ మోడల్​గా గుర్తింపు పొందిన వోక్స్​వ్యాగన్​ వెంటో కూడా ఈ ఏడాది మాయమైపోయింది. 2010లో 1 లీటర్​ టర్బో పెట్రోల్​ టీఎస్​ఐ ఎంటీ/ఏటీ ఇంజిన్​తో ఇది లాంచ్​ అయ్యింది. 12ఏళ్లల్లో ఎన్నో ఫేస్​లిఫ్ట్​ వర్షెన్స్​ వచ్చాయి. డిస్కంటిన్యూకు ముందు దీని ధర రూ. 9.99లక్షలు- 14.79లక్షల మధ్యలో ఉండేది.

రెనాల్ట్​ డస్టర్​..

Renault Duster discontinued in India : 2012లో లాంచ్​ అయిన రెనాల్ట్​ డస్టర్​కు ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఫాలోయింగ్​ ఎక్కువగానే ఉండేది. ఇందులో 1.3 లీటర్​ టర్బో పెట్రోల్​ ఎంటీ/సీవీటీ- 1.5 లీటర్​ పెట్రోల్​ ఎంటీ ఇంజిన్​ వేరియంట్స్​ ఉండేవి. డిస్కంటిన్యూకి ముందు దీని ధర రూ. 9.86లక్షలు- రూ. 14.25లక్షల మధ్యలో ఉండేది. అయితే.. అంతర్జాతీయ మార్కెట్​లో అడుగుపెట్టేందుకు రెనాల్ట్​ డస్టర్​ కొత్త వర్షెన్​ సిద్ధమవుతోందని సమాచారం. ఇండియాలో మాత్రం అది రాకపోవచ్చు!

హ్యుందాయ్​ సాంట్రో..

Hyundai Santro discontinued in India : ఇండియా మార్కెట్​లోకి హ్యుందాయ్​ సాంట్రో 2018లో తిరిగి వచ్చింది. కానీ అదృష్టం వరించలేదు! నాలుగేళ్ల తర్వాత.. ఈ కారును హ్యుందాయ్​ ఈ ఏడాది మళ్లీ డిస్కంటిన్యూ చేసేసింది. ఇందులో 1.1 లీటర్​ పెట్రోల్​ ఎంటీ/ఏఎంటీ ఇంజిన్​ ఉండేది. డిస్కంటిన్యూకి ముందు దీని ధర రూ. 4.90లక్షలు- 6.42లక్షల మధ్యలో ఉండేది.

హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​- ఆరా డీజిల్​..

Hyundai Grand i10 Nios : హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​- ఆరా డీజిల్​ కార్లు మంచి మైలేజ్​ని ఇచ్చేవి. కానీ ఇవి డిస్కంటిన్యూ అయిపోవడం నిజంగా బాధ కలిగించే విషయమే. 2019లో మార్కెట్​లోకి అడుగుపెట్టిన నియోస్​లో 1.2లీటర్​ డీజిల్​ ఎంటీ/ఏఎంటీ ఇంజిన్​ ఉండేది. 2020లో వచ్చిన ఆరాలోనూ ఇదే ఉండేది. నియోస్​ ధర రూ. 7.85లక్షలు- 8.46లక్షల మధ్యలో ఉండేది. ఇక ఆరా డీజిల్​ ధర 8.06లక్షలు- రూ. 9.51లక్షల మధ్యలో ఉండేది.

డాట్సన్​ కార్లు..

Datsun Redi-Go, Go, Go Plus : మూడు మోడల్స్​ను ఈ ఏడాది నిలిపివేసింది డాట్సన్​. అవి.. డాట్సన్​ రెడి-గో, గో, గో ప్లస్​. అంతర్జాతీయంగా కూడా ఈ బ్రాండ్​ మాయమైపోనుంది. వాస్తవానికి.. 2014 లాంచ్​ సమయం నుంచి ఈ మూడు మోడల్స్​ కూడా ఇండియాలో పెద్దగా అమ్ముడుపోలేదు. లాంచింగ్​ సమయంలో.. ది మోస్ట్​ అఫార్డిబుల్​ 7 సీటర్​ వెహికిల్​గా గుర్తింపు పొందింది గో ప్లస్​. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వీటిల్లో 0.8లీటర్​ పెట్రోల్​, 1.2లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండేవి. ధర రూ. 3.98లక్షలు- రూ. 7లక్షల మధ్యలో ఉండేది.

మహీంద్రా ఆల్టూరస్​ జీ4..

Mahindra Alturas G4 discontinued : ఈ మహీంద్రా ఎస్​యూవీ సేల్​కు అందుబాటులో లేదు. 2018లో లాంచ్​ అయిన ఈ మోడల్​లో 2.2లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఉండేది. ఫీచర్స్​ గొప్పగానే ఉన్నా.. ఎందుకో ఈ ఎస్​యూవీ క్లిక్​ అవ్వలేదు. అదే సమయంలో ఎక్స్​యూవీలతో మహీంద్రా బిజీ అయిపోయింది. చివిరికి.. ఈ ఆల్టూరస్​ జీ4.. 2022లో మాయమైపోయింది. దీని ధర రూ. 30.68లక్షలుగా ఉండేది.

టాపిక్

తదుపరి వ్యాసం