తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top 5 Most Affordable 250cc Bikes : 250 సీసీ బైక్​ కొనాలా? టాప్​ 5 ఇవే..!

Top 5 most affordable 250cc bikes : 250 సీసీ బైక్​ కొనాలా? టాప్​ 5 ఇవే..!

18 November 2022, 13:27 IST

google News
    • Top 5 most affordable 250cc bikes in India : 250 సీసీ రేంజ్​లో కొత్త బైక్​ తీసుకోవాలని చూస్తున్నారా? రూ. 2లక్షల లోపు ఉన్న ది బెస్ట్​ బైక్స్​ లిస్ట్​ మీకోసం..
బజాజ్​ డామినర్​ 250 బైక్​
బజాజ్​ డామినర్​ 250 బైక్​ (HT AUTO)

బజాజ్​ డామినర్​ 250 బైక్​

Top 5 most affordable 250cc bikes in India : సొంతంగా ఓ బైక్​.. దాని మీద రోడ్​ ట్రిప్​.. ఆహా ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా! ఇది చాలా మంది యువత కల. బైక్​ ట్రిప్​ మీద ఎక్కడికైనా వెళ్లాలని యువత తహతహలాడుతుంది. వీరిలో మీరూ ఒకరా? ట్రిప్​తో పాటు సాధారణ అవసరాల కోసం మంచి బైక్​ కొనాలని భావిస్తున్నారా? ఇండియాలోని టాప్​ 5.. ది బెస్ట్​ 250సీసీ బైక్స్​ లిస్ట్​ను మీకోసం మేము తీసుకొచ్చాము. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

బజాజ్​ పల్సర్​ ఎన్​250 :

Bajaj Pulsar N250 single channel ABS : ఈ లిస్ట్​లో అత్యంత చౌకైన బైక్​ ఇదే. దీని ధర రూ. 1,40,666గా ఉంది. కేటీఎం 250 డ్యూక్​ కన్నా దీని ధర రూ. లక్ష తక్కువగా ఉంటుంది. 2021లో పల్సర్​ లైనప్​ను మరింత ఆకర్షణీయంగా మార్చేసింది బజాజ్​. ఇందులో ఎన్​250 ఒకటి. 24.5హెచ్​పీ, 21.5ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది. దీని బరువు 162కేజీలు. ఇది 35కేఎంపీఎల్​ మైలేజ్​ను ఇస్తోంది.

యమహా ఎఫ్​జీ25..

Yamaha FZ25 price : యమహా ఎఫ్​జీ25.. డిజైన్​ పరంగా సూపర్​ కూల్​ బైక్​గా గుర్తింపు పొందింది. కానీ ఫస్ట్​ జనరేష్​ 2017 మోడల్​కు దీనికి ఎన్నో పోలికలు ఉన్నాయి. 20.8హెచ్​పీ, 20.1ఎన్​ఎం టర్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది. దీని ధర రూ. 1,47,900. ఈ బైక్​ 39-40 కేఎంపీఎల్​ మధ్యలో మైలేజ్​ని ఇస్తుంది.

ఇండియాలో బడ్జెట్​లో దొరుకుతున్న బెస్ట్​ కార్స్​ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బజాజ్​ డామినర్​ 250..

Baja Dominar 250 price : డామినర్​ 400కు తగ్గట్టుగానే ఉంటుంది ఈ డామినర్​ 250. ఇందులో లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. 27హెచ్​పీ పవర్​ను, 23.5ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది. దీని బరువు 108కేజీలు. ధర రూ. 1,75,002. ఈ బైక్​ 35 కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుంది.

సుజుకీ జిక్సర్​ 250..

Suzuko Gixxer 250 : దీని ధర రూ. 1,81,400. ఇందులో పవర్​, ఫీచర్స్​ పరంగా గొప్పగా ఏం లేకపోయినా.. రైడ్​ మాత్రం సాఫీగా సాగిపోతోందన్న ఫీలింగ్​ కచ్చితంగా వస్తుంది. 26.5హెచ్​పీ, 22.2ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో ఆయిల్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. సుజుకీ జిక్సర్​ 250.. 38కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుంది.

క్యూజే మోటార్​ ఎస్​ఆర్​సీ 250..

QJMotor SRC 250 price : ఈ లిస్ట్​లో అత్యంత ఖరీదైన బైక్​ ఇదే. ఇటీవలే ఇది ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీని ధర రూ. 1,99,000గా ఉంది. ఇందులో ఆయిల్​ కూల్డ్​ 249సీసీ ప్యారలెల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంటుంది. 17.4హెచ్​పీ పవర్​, 17ఎన్​ఎం టార్క్​ను ఇది జనరేట్​ చేస్తుంది. 30-35 కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుంది ఈ బైక్​.

టాపిక్

తదుపరి వ్యాసం