Top 10 Safest Cars in India: భారత్‍లో టాప్-10 సేఫెస్ట్ కార్లు ఇవే.. లిస్ట్‌లో ఓ కొత్త మోడల్ ఎంట్రీ..
13 December 2022, 17:34 IST
- Top 10 Safest Cars in India: గ్లోబల్ ఎన్‍సీఏపీ క్రాష్ టెస్టులో దక్కిన పాయింట్ల ఆధారంగా ఇండియాలో టాప్-10 సేఫెస్ట్ కార్ల జాబితా ఇది.
Top 10 Safest Cars in India: భారత్‍లో టాప్-10 సేఫెస్ట్ కార్లు ఇవే
Top 10 Safest Cars in India: ఇండియాలో లభిస్తున్న టాప్-10 సురక్షితమైన కార్ల (Top-10 Safest Cars) జాబితాలోకి మహీంద్రా స్కార్పియో-ఎన్ తాజాగా యాడ్ అయింది. గ్లోబల్ ఎన్‍సీఏపీ (Global NCAP) క్రాష్ టెస్ట్ టెస్టులో 5 రేటింగ్ సాధించి.. సత్తాచాటింది. స్కార్పియోకు కొత్త జనరేషన్‍గా ఈ ఫ్లాగ్‍షిప్ స్కార్పియో-ఎన్ అందుబాటులోకి వస్తోంది. కాగా, గ్లోబల్ ఎన్‍సీఏపీ పాయింట్ల ఆధారంగా ప్రస్తుతం ఇండియాలో టాప్-10 సేఫెస్ట్ కార్లుగా ఏవి ఉన్నాయో ఇక్కడ చూడండి.
ఫోక్స్‌వ్యాగన్ టైగున్ (Volkswagen Taigun)
భారత్‍లో సేఫెస్ట్ కార్స్ జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ టాప్‍లో ఉంది. గ్లోబల్ ఎన్‍సీఏపీ క్రాష్ టెస్టులో 5 రేటింగ్‍ను సాధించింది. పెద్దలు, పిల్లల ఆక్యుపేషన్ ప్రొటెక్షన్ (Adult, Child Occupant Protection) కొలమానాల్లో.. రెండింటిలోనూ ఐదు స్టార్ల రేటింగ్‍ను పొందింది. ఓవరాల్‍గా 71.64 పాయింట్లను సాధించింది.
స్కోడా కుషాక్ (Skoda Kushaq)
Global NCAP క్రాష్ టెస్ట్ లో స్కోడా కుషాక్ కూడా 5 రేటింగ్‍ను సాధించింది. టెక్నికల్‍గా ఫోక్స్‌వ్యాగన్ టియాగున్‍లాగే ఇది ఉంటుంది. అయితే, ఇండియాలో సేఫెస్ట్ కార్ల లిస్టులో రెండో స్థానంలో నిలిచింది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N)
ఫ్లాగ్‍షిప్ ఎస్‍యూవీ స్కార్పియోకు కొత్త జనరేషన్ వెర్షన్‍గా ఈ స్కార్పియో-ఎన్ వచ్చింది. తాజాగా Global NCAP Crash Testలో ఫైప్ స్టార్ రేటింగ్‍ను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (Adult Occupant Protection) లో ఫైవ్ స్టార్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (Child Occupant Protection) టెస్టులో 3 రేటింగ్‍ను దక్కిచుకుంది. ఓవరాల్‍గా 58.18 పాయింట్లను సాధించింది. మొత్తంగా ఇండియా సేఫెస్ట్ కార్స్ జాబితాలో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)
మహీంద్రా ఫ్లాగ్‍షిప్ ఎక్స్‌యూవీ700.. అడల్ట్ ఆక్యుపేషన్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‍లో ఫైవ్ స్టార్, చైల్డ్ విభాగంలో ఫోర్ స్టార్ రేటింగ్‍ను పొందించింది. ఓవరాల్‍గా 57.69 పాయింట్లతో నాలుగో ప్లేస్‍లో ఉంది.
టాటా పంచ్ (Tata Punch)
టాటా మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న ఈ స్మాలెస్ట్ ఎస్‍యూవీ టాటా పంచ్.. అడల్ట్, చైల్డ్ ఆక్యుపంట్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్‍లో ఫైర్ స్టార్ రేటింగ్‍ను దక్కించుకుంది. ఓవరాల్‍గా 57.34 పాయింట్లతో ఇండియా సేఫెస్ట్ కార్లు జాబితాలో ఐదో ప్లేస్‍లో కొనసాగుతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)
గ్లోబల్ ఎన్‍సీఏపీ క్రాష్ టెస్టులో ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‍యూవీ ఓవరాల్‍గా 53.86 పాయింట్లను పొందింది. అడల్ట్ విభాగంలో ఐదు, చైల్డ్ ఆక్యుపంట్ ప్రొటెక్షన్‍లో నాలుగు స్టార్లను దక్కించుకుంది. మొత్తంగా ఈ లిస్టులో ఆరో స్థానంలో ఉంది.
టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
టాటా ఆల్టోరేజ్ కారు ఎన్‍సీఏపీ క్రాష్ టెస్టులో.. పెద్దల ఆక్యుపంట్ ప్రొటెక్షన్ టెస్టులో 5 స్టార్లు, చైల్డ్ ప్రొటెక్షన్ టెస్టులో మూడు స్టార్లు దక్కించుకుంది. ఓవరాల్‍గా 45.13 పాయింట్లను స్కోర్ చేసింది.
టాటా నెక్సాన్ (Tata Nexon)
ఇండియాలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‍యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. Global NCAP క్రాష్ టెస్టులో ఈ కార్.. అడల్ట్ ఆక్యుపంట్ ప్రొటెక్షన్‍లో ఐదు స్టార్లను, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‍లో మూడు స్టార్లను పొందింది. మొత్తంగా 41.06 పాయింట్లను దక్కించుకుంది. భారత సేఫెస్ట్ కార్ల జాబితాలో ఎనిమిదో ప్లేస్‍లో ఉంది.
మహీంద్రా థార్ (Mahindra Thar)
కొత్త జనరేషన్ మహీంద్రా థార్ ఎస్‍యూవీ.. ఎన్‍సీఏపీ క్రాష్ టెస్టులో ఓవరాల్‍గా 53.63 పాయింట్లు చేసింది. అడల్ట్, చైల్డ్ ఆక్యుపంట్ ప్రొటెక్షన్‍లో ఓవరాల్‍గా ఫోర్ స్టార్ రేటింగ్‍ను దక్కించుకుంది.
హోండా సిటీ 4వ జెనరేషన్ (Honda City 4th Gen)
గ్లోబల్ ఎన్‍సీఓపీ క్రాష్ టెస్టు.. అడల్ట్, చైల్డ్ ఆక్యుపంట్ ప్రొటెక్షన్‍లో ఓవరాల్‍గా నాలుగు స్టార్ల రేటింగ్‍ను హోండా సిటీ 4వ జనరేషన్ కార్ దక్కించుకుంది. మొత్తంగా 50.39 పాయింట్లను పొందింది. దీంతో ఇండియా సేఫెస్ట్ కార్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.