తెలుగు న్యూస్  /  Business  /  Boeing Plans To Slash Around 2,000 Finance And Hr Jobs In 2023: Report

Boeing job cuts: బోయింగ్ లోనూ ఉద్యోగాల కోత; టీసీఎస్ కు ఔట్ సోర్సింగ్

HT Telugu Desk HT Telugu

07 February 2023, 20:39 IST

  • Boeing job cuts: ప్రపంచ వ్యాప్తంగా అన్ని మేజర్ కంపెనీలు తమ ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. తాజాగా, ఆ జాబితాలోకి ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ బోయింగ్ (Boeing) చేరింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Boeing job cuts: బోయింగ్ ఏరోస్పేస్ (Boeing aero space) సంస్థ లో 2022 డిసెంబర్ 31 నాటికి ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.56 లక్షలు.

Boeing job cuts: ఫైనాన్స్, హెచ్ ఆర్ నుంచే ఎక్కువగా..

బోయింగ్ (Boeing) సంస్థ నుంచి 2023లో కనీసం 2 వేల మంది ఉద్యోగులను (lay offs) తొలగించనున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్ , మానవ వనరుల విభాగం నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని (Boeing lay offs) సంస్థ భావిస్తోంది. 2023లో స్వచ్ఛంధంగా వెళ్లేవారు, లే ఆఫ్ ద్వారా వెళ్లే వారు కలిపి మొత్తంగా 2000 మంది ఉద్యోగులు సంస్థ నుంచి వెళ్లిపోనున్నారని బోయింగ్ ప్రకటించింది. ఇప్పటికైతే ఇంకా లే ఆఫ్ ప్రక్రియ ప్రారంభించలేదని వివరించింది.

Boeing job cuts: పెరిగిన ఉద్యోగుల సంఖ్య

గత సంవత్సరం బోయింగ్ (Boeing) మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 15 వేల మంది పెరిగారు. అలాగే, వివిధ విభాగాల్లో ఈ సంవత్సరం మరో 10 వేల మంది హైర్ చేసుకోనున్నారు. అయితే, ముఖ్యంగా ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లోనే ఈ హైరింగ్ (Boeing hiring) ఉంటుందని, ఫైనాన్స్, హెచ్ ఆర్ విభాగాల నుంచి రీస్ట్రక్చరింగ్ ద్వారా కొందరు ఉద్యోగులను తొలగిస్తామని (Boeing lay offs) వివరించింది. ఈ ఫైనాన్స్, హెచ్ ఆర్ తో పాటు మరికొన్ని విభాగాల విధులను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలని బోయింగ్ భావిస్తున్నట్లు సియాటిల్ టైమ్స్ వెల్లడించింది. అందుకుగానూ, బెంగళూరులోని టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (Tata Consulting Services TCS) తో బోయింగ్ (Boeing) చర్చలు జరుపుతోందని వెల్లడించింది. సియాటిల్ టైమ్స్ కథనం ప్రకారం బోయింగ్ లోని ఫైనాన్స్ విభాగం నుంచి 1500 మంది ఉద్యోగులను, మానవ వనరుల విభాగం నుంచి 400 మంది ఉద్యోగులను (Boeing lay offs) తొలగించనున్నారు.

టాపిక్