Lay offs in Software firm SAP: లే ఆఫ్స్ బాటన మరో దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ-german software firm sap to cut 3 000 jobs explore qualtrics stake sale ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  German Software Firm Sap To Cut 3,000 Jobs, Explore Qualtrics Stake Sale

Lay offs in Software firm SAP: లే ఆఫ్స్ బాటన మరో దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 03:03 PM IST

Lay offs in German software firm SAP: మరో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ తన ఉద్యోగులను భారీగా తొలగించనున్నట్లు ప్రకటించింది. జర్మనీకి చెందిన మల్టీ నేషనల్ ఎస్ఏపీ(SAP) సంస్థ తాజాగా తన ఉద్యోగుల లే ఆఫ్ (LAY OFF) పై నిర్ణయం తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Lay offs in German software firm SAP: జర్మనీ కి చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఎస్ఏపీ(SAP) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో కనీసం 3000 మందిని తొలగించనున్నట్లు (lay off) గురువారం ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2.5శాతం.

Lay offs in major Tech companies: అన్ని మేజర్ కంపెనీల లే ఆఫ్ బాట

అంతర్జాతీయంగా విజయవంతమైన సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటైన ఎస్ఏపీ(SAP) కూడా ఉద్యోగుల తొలగింపు (lay off) నిర్ణయం తీసుకోవడంపై పరిశ్రమ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే దిగ్గజ టెక్నాలజీ, ఈ కామర్స్, సోషల్ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు (lay off) ప్రకటించాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet) 12 వేల మంది ఉద్యోగులను, ఆమెజాన్ (Amazon) 18 వేల మంది ఉద్యోగులను, మెటా (Meta) 11 వేల మంది ఉద్యోగులను, ట్విటర్ (Twitter) 4 వేల మంది ఉద్యోగులను, మైక్రోసాఫ్ట్ (Microsoft) 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇవి కాకుండా, ఇతర చాలా కంపెనీలు కూడా పెద్ధ సంఖ్యలో తమ ఉద్యోగులకు లే ఆఫ్ (lay off) ప్రకటించాయి. 2022 లో ప్రారంభమైన ఈ ఆందోళనకర ధోరణి 2023 లోనూ కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Lay offs in German software firm SAP: ఎస్ఏపీ (SAP) నుంచి

ఈఆర్ పీ() అప్లికేషన్ ఎస్ఏపీ (SAP) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన SAP తమ ఉద్యోగుల్లో 3 వేల మందిని తొలగిస్తున్నట్లు (lay off) ప్రకటించింది. దాంతో పాటు క్వాల్ ట్రిక్స్ (Qualtrics) కంపెనీలో తమ మిగిలిన వాటాను కూడా అమ్మివేయనున్నట్లు వెల్లడించింది. సర్వే సాఫ్ట్ వేర్ బిజినెస్ లో ఉన్న క్వాల్ ట్రిక్స్ (Qualtrics) మార్కెట్ వాల్యూ 7 బిలియన్ డాలర్లు కాగా, అందులో 71% వాటా ఎస్ఏపీ (SAP) కి ఉంది. నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు, ఇకపై క్లౌడ్ బిజినెస్ (cloud business) పై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. SAP క్లౌడ్ బిజినెస్ (cloud business) లో డిసెంబర్ తో ముగిసే త్రైమాసికంలో 30% ఆదాయాన్ని అధికంగా పొందింది. 2023తో పాటు 2024 లో కూడా పొదుపు చర్యలను కొనసాగిస్తామని SAP ప్రకటించింది. ప్రస్తుత ఉద్యోగాల కోతకు సంబంధించి 200 ఉద్యోగాలను జర్మనీలోని SAP ప్రధానకార్యాలయంలో నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది.

WhatsApp channel

టాపిక్