తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bob Cuts Home Loan Interest Rates:హోం లోన్ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ వార్త..

BoB cuts home loan interest rates:హోం లోన్ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ వార్త..

HT Telugu Desk HT Telugu

23 November 2022, 19:25 IST

  • BoB cuts home loan interest rates: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda -BoB) గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BoB cuts home loan interest rates: సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు మొదట చూసేది చవకగా గృహ రుణాలను ఇచ్చే బ్యాంకులు, లేదా ఫైనాన్స్ సంస్థల వైపే. అలాంటి వారి కోసం ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda -BoB) శుభవార్తను తీసుకువచ్చింది.

BoB cuts home loan interest rates: వడ్డీ రేట్ల తగ్గింపు

ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda -BoB) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. హోం లోన్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు(25 bps) తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశం పరిమిత కాలం పాటే ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 14 నుంచి ఈ ఆఫర్ ను ప్రారంభించామని తెలిపింది. ఇప్పుడు తమ వద్ద గృహ రుణాలు తీసుకునేవారికి 8.50% కాకుండా, 8.25% వడ్డీ రేటు వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్లో హోం లోన్ల వడ్డీ రేట్లలో ఇదే అతి తక్కువ అని స్పష్టం చేసింది. ఈ అవకాశం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుదని వెల్లడించింది. సాధారణంగా సిబిల్ స్కోర్ 700 కి పైన ఉన్న ఉద్యోగులకు 8.25% వడ్డీ రేటుకు హోం లోన్ లభించే అవకాశం ఉంది.

No processing fee for Home loans in BoB: ప్రాసెసింగ్ ఫీ లో కూడా..

అలాగే, హోం లోన్ కోసం చూస్తున్నవారికి మరో శుభవార్త కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda -BoB) తెలిపింది. 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 31 లోపు అప్లై చేసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీ ఉండదని స్పష్టం చేసింది. దరఖాస్తు దారుల క్రెడిట్ ప్రొఫైల్, సిబిల్ స్కోర్ ల ఆధారంగా, గృహరుణాలపై వడ్డీ రేటును 8.25% నుంచి ప్రారంభిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని, ఈ సమయంలో వినియోగదారుల సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో వడ్డీ రేటును తగ్గించాలని నిర్ణయించామని బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda -BoB) తెలిపింది.

BoB cuts home loan interest rates: ఇతర సదుపాయాలు కూడా..

వడ్డీ రేటులో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు, జీరో ప్రాసెసింగ్ ఫీ, మినిమం పేపర్ వర్క్, 30 ఏళ్ల వరకు రీ పేమెంట్ టెన్యూర్, ప్రి పేమెంట్, లేదా పార్ట్ పేమెంట్ పై ఎలాంటి రుసుములు లేకపోవడం, డోర్ టు డోర్ సర్వీస్.. మొదలైన సేవలను కూడా అందిస్తున్నామని BoB వెల్లడించింది. ఉద్యోగస్తులకు 8.25% నుంచి 9.85% వరకు, ఇతరులకు 8.30% నుంచి 9.95%వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు ఉంటుందన్నారు.