తెలుగు న్యూస్  /  Business  /  Bmw X3 20d M Sport Variant Launched Check Price Specifications

BMW X3 20d M Sport: ఎక్స్3 లైనప్‍లో నయా ఫ్లాగ్‍షిప్ కారును లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ: వివరాలివే

07 March 2023, 14:38 IST

    • BMW X3 20d M Sport: బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్స్ ప్రీమియమ్ కారు లాంచ్ అయింది. ప్రీమియమ్ ఫీచర్లు, స్పోర్టీ లుక్‍తో అడుగుపెట్టింది.
BMW X3 20d M Sport: ఎక్స్3 లైనప్‍లో నయా ఫ్లాగ్‍షిప్ కారును లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ: వివరాలివే
BMW X3 20d M Sport: ఎక్స్3 లైనప్‍లో నయా ఫ్లాగ్‍షిప్ కారును లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ: వివరాలివే (HT Auto)

BMW X3 20d M Sport: ఎక్స్3 లైనప్‍లో నయా ఫ్లాగ్‍షిప్ కారును లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ: వివరాలివే

BMW X3 20d M Sport launched : బీఎండబ్ల్యూ ఎక్స్ లైనప్‍లో మరో ప్రీమియమ్ కారు లాంచ్ అయింది. బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ (BMW X3 20d M Sport) భారత మార్కెట్‍లోకి వచ్చింది. అప్‍డేటెడ్ ఫీచర్లు, సూపర్ డిజైన్‍తో ఈ కారు అడుగుపెట్టింది. లగ్జరీ ఎడిషన్ కన్నా ప్రీమియమ్‍గా ఉంది. బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్ వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

BMW X3 20d M Sport: డిజైన్, ఫీచర్లు

అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‍లైట్స్, ఎల్ఈడీ టైల్‍లైట్స్, అల్యూమినియమ్ ఫినిష్డ్ రూఫ్ రైల్స్, 19 ఇంచుల ఎం-లైట్ అలాయ్ వీల్స్‌తో బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్స్ వస్తోంది. ఎం స్పోర్ట్స్ ఎక్స్‌టీరియర్‌ ప్యాక్ ఉంటుంది. దీంతో చూడడానికి ఈ నయా కారు చాలా స్పోర్టీగా, స్టైలిష్‍గా కనిపిస్తుంది. సోర్ట్స్ సీట్లు, లెదర్ స్టీరింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఈ కారు క్యాబిన్‍లో ఉన్నాయి. అలాగే నావిగేషన్‍తో కూడిన బీఎండబ్ల్యూ కాక్‍పిట్ ప్లస్ పేరుతో 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది.

BMW X3 20d M Sport : బ్లాక్ షాఫైర్, సోఫిస్టో బ్రిలియంట్ ఎఫెక్ట్, మినరల్ వైట్, ఫిటోనిక్ బ్లూ.. కలర్ ఆప్షన్‍లలో ఈ కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్స్ కారు వస్తోంది.

BMW X3 20d M Sport Features : బ్రేక్ ఫంక్షన్‍తో క్రూజ్ కంట్రోల్, గెస్చర్ కంట్రోల్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పార్క్ అసిస్టెంట్ ప్లస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యాంబియెంట్ లైట్, హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగ్‍లతో పాటు మరిన్ని ప్రీమియమ్ ఫీచర్లతో ఈ బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్స్ కారు వస్తోంది.

BMW X3 20d M Sport: ఇంజిన్, పర్ఫార్మెన్స్

బీఎండబ్ల్యూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్స్ కారు 2.0-లీటర్ డీజిల్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‍ను కలిగి ఉంది. 188 bhp గరిష్ఠ పవర్, 400 Nm పీక్ టార్క్యూను ఈ ప్రీమియమ్ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.

BMW X3 20d M Sport: ధర

బీఎండబ్లూ ఎక్స్3 20డీ ఎం స్పోర్ట్స్ ధర రూ.69.90 లక్షలు (ఎక్స్- షోరూమ్)గా ఉంది. ఎక్స్3 లైనప్‍లో లగ్జరీ ఎడిషన్ వేరియంట్ కంటే ఈ కారు మరో రూ.2.60లక్షలు ధర ఎక్కువగా ఉంది.