తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Banks Hike Rd Rates: ఈ బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పెంపు

Banks hike RD rates: ఈ బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పెంపు

HT Telugu Desk HT Telugu

31 October 2022, 11:59 IST

    • Banks hike RD rates: బ్యాంకులు తమ రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకుల రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ) పై వడ్డీ రేట్లు ఇక్కడ చూడండి.
హెచ్‌డీఎఫ్‌సీ సహా పలు బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు
హెచ్‌డీఎఫ్‌సీ సహా పలు బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు (MINT_PRINT)

హెచ్‌డీఎఫ్‌సీ సహా పలు బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేటు

Banks hike RD rates: రికరింగ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)ల తరహాలో రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శాలరీపై ఆధారపడిన వారు, సీనియర్ సిటిజెన్లు ఈ రికరింగ్ డిపాజిట్లు చేస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

నిర్ధిష్ట కాలంపాటు నెలనెలా కొంత సేవింగ్స్ చేసుకునేలా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉపయోగపడుతుంది. అయితే రికరింగ్ డిపాజిట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కాస్త భిన్నమైనవి. ఆర్డీ ఖాతాదారులు తాము నెలనెలా ఎంత మొత్తం పొదుపు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆమేరకు జమ చేసుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఇవి సేవింగ్స్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌గా ఉపయోగపడతాయి.

దాదాపు ఇండియాలో బ్యాంకులన్నీ 6 నెలల నుంచి 10 ఏళ్ల కాలానికి రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నాయి.

SBI RD rates: ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

ఎస్‌బీఐ తన రికరింగ్ డిపాజిట్లపై అక్టోబరు 22న అమల్లోకి వచ్చేలా వడ్డీ రేట్లు పెంచింది. ఎస్‌బీఐ ఒక ఏడాది నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై 6.10 శాతం నుంచి 6.25 శాతం మేర వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.

వడ్డీ రేట్లు ఇలా..

1 ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు - 6.10 శాతం

2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు - 6.25 శాతం

3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు - 6.10 శాతం

5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు - 6.10 శాతం

HDFC Bank RD rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేటు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది. 6 నెలల్లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై 4.50 శాతం, 9 నెలల్లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.25 శాతం చెల్లిస్తుంది. ఇక 12 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.10 శాతానికి పెంచింది.

15 నెలల నుంచి 24 నెలల్లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.15 శాతానికి పెంచింది. ఇక 90 నెలల నుంచి 120 నెలల్లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.20 శాతం ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు 26 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చాయి.

ICICI Bank RD rates: ఐసీఐసీఐ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

ఐసీఐసీఐ బ్యాంక్ 6 నెలల నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో కూడిన రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. స్కీమ్ కాలపరిమితిని బట్టి 4.25 శాతం నుంచి 6.20 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లన్నీ అక్టోబరు 18 నుంచి అమల్లోకి వచ్చాయి.