తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2022 Ktm Rc 390 Bike: మార్కెట్లోకి స్టైలిష్ న్యూ కేటీఎం బైక్.. ధర ఎంతో తెలుసా?

2022 KTM RC 390 bike: మార్కెట్లోకి స్టైలిష్ న్యూ కేటీఎం బైక్.. ధర ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

24 December 2022, 21:41 IST

  • KTM RC 390: యూత్ ఇష్టపడే బ్రాండ్స్ లో కేటీఎం(KTM) బైక్ బ్రాండ్ ఒకటి. ఈ బ్రాండ్ బజాజ్ ఆటో సంస్థదన్న విషయం తెలిసిందే.

2022 కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్ బైక్.
2022 కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్ బైక్.

2022 కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్ బైక్.

KTM RC 390: తాజాగా, బజాజ్ ఆటో(Bajaj Auto) కేటీఎం(KTM) నుంచి ఒక కొత్త మోడల్ బైక్ ను ఆవిష్కరించింది. భారత్ లో ఈ 2022 కేటీఎం ఆర్ సీ 390(KTM RC 390) స్పోర్ట్స్ బైక్ ఎక్స్ షోరూమ్ ధరను రూ. 3.14 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ రేసింగ్ బ్లూ(Racing Blue), ఎలక్ట్రిక్ ఆరెంజ్(Electric Orange) రంగుల్లో లభ్యమవుతుంది.

KTM RC 390: న్యూ డిజైన్..

బజాజ్ ఆటోకు చెందిన ఈ 2022 KTM RC 390 స్పోర్ట్స్ బైక్ ను పూర్తిగా స్పోర్టీ డిజైన్ లో రూపొందించారు. స్టైలిష్ లుక్ తో, పూర్తిగా న్యూ మోడల్ హెడ్ ల్యాంప్ డిజైన్ తో రూపొందించారు. ఈ హెడ్ ల్యాంప్ లో డే లైట్ రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. దీనిలో బ్లూ టూత్ సుదుపాయంతో, యాంబియెంట్ లైటింగ్ తో ఉన్న టీఎఫ్టీ ఇన్ స్ట్రమెంట్ క్లసర్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ 2022 KTM RC 390 బైక్ లో పవర్ ఫుల్ 373 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 9000 ఆర్పీఎం(9,000 rpm) వద్ద 42.9 హెచ్ పీ(42.9 hp) ఔట్ పుట్ ను, 7000 ఆర్పీఎం(7,000 rpm) వద్ద 37 ఎన్ఎం టార్క్(37 Nm of torque) ను ఇస్తుంది. ఇందులో స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ తో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ ఆల్ న్యూ స్టైలిష్ స్పోర్ట్ బైక్ ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.7 లీటర్లు మాత్రమే. ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కార్నర్స్ లో స్కిడ్ కాకుండా కార్నరింగ్ ఏబీఎస్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.

టాపిక్