తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Asus Aio A3 All- In-one Desktops: ఆసుస్ కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు వచ్చేశాయి

Asus AiO A3 All- in-One Desktops: ఆసుస్ కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు వచ్చేశాయి

23 November 2022, 16:33 IST

    • Asus AiO A3402, Asus AiO A3202 Desktops: ఆసుస్ నుంచి కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు లాంచ్ అయ్యాయి. వీటి ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.
Asus A3 All- in-One Desktops: ఆసుస్ కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు వచ్చేశాయి (Photo: Asus)
Asus A3 All- in-One Desktops: ఆసుస్ కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు వచ్చేశాయి (Photo: Asus)

Asus A3 All- in-One Desktops: ఆసుస్ కొత్త ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు వచ్చేశాయి (Photo: Asus)

Asus A3402, Asus A3202 Desktops: ఏఐఓ ఏ3 సిరీస్ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‍(All-in-One Desktop)లను ఇండియాలో ఆసుస్ లాంచ్ చేసింది. ఆసుస్ ఏఐఓ ఏ3202, ఆసుస్ ఏఐఓ ఏ3402 పేర్లతో ఈ డెస్క్‌టాప్‍లు అడుగుపెట్టాయి. అదిరిపోయే లుక్, సూపర్ పర్ఫార్మెన్స్ తో వీటిని తీసుకొచ్చినట్టు ఆసుస్ తెలిపింది. ఇంటెల్ 12వ జనరేషన్ ప్రాసెసర్ లతో ఈ డెస్క్‌టాప్‍లు వస్తున్నాయి. ఆసుస్ ఏ3402, ఆసుస్ ఏ3202 ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Asus A3402 All-in-One Desktop: స్పెసిఫికేషన్లు

23.8 ఇంచుల ఫుల్ హెచ్‍డీ ఐపీఎస్ ఎల్‍సీడీ నానో ఎడ్జ్ డిస్‍ప్లేతో ఆసుస్ ఏ3402 డెస్క్‌టాప్‍ వస్తోంది. 250 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. టచ్ స్క్రీన్ వేరియంట్‍.. యాంటీ గ్రేర్ డిస్‍ప్లేను కలిగి ఉంటుంది. ఆసుస్ స్పెండిడ్, ట్రు2 లైఫ్ టెక్నాలజీతో ఈ డిస్‍ప్లే ఉంది.

12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1235జీ7 ప్రాసెసర్ ఈ Asus AiO A3402 డెస్క్ టాప్‍లో ఉంటుంది. ఇంటెల్ ఐరిష్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ తో వస్తోంది. గరిష్ఠంగా 32జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎస్‍ఎస్‍డీ స్టోరేజ్ ఉంటుంది. అదనంగా 2.5 ఇంచుల స్టోరేజ్ స్లాట్‍ను కూడా ఈ డెస్క్ టాప్‍లో ఇచ్చింది ఆసుస్. రెండు స్టీరియో స్పీకర్లతో ఈ డిస్క్ టాప్ వస్తోంది. ఆసుస్ సోనిక్ మాస్టర్ ప్రీమియమ్ టెక్నాలజీతో కూడిన డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది.

Asus A3402 డెస్క్‌టాప్‍కు 3 యూఎస్‍బీ టైప్-ఏ పోర్టులు, 2 టైప్-సీ పోర్టులు, ఓ యూఎస్‍బీ 2.0 పోర్టు, 2 హెచ్‍డీఎంఐ పోర్టులు, ఎథెర్‍నెట్ పోర్ట్ ఉంటాయి. వైఫై 6, బ్లూటూత్ 5.2, 720 పిక్సెల్ వెబ్ కెమెరా, వైర్లెస్ మౌస్, వైర్లెస్ కీబోర్డుతో ఈ డెస్క్ టాప్ వస్తోంది. విండోస్ 11పై రన్ అవుతుంది. 90Wh బ్యాటరీ ఈ డెస్క్ టాప్‍లో ఉంటుంది.

Asus A3202 All-in-One Desktop: స్పెసిఫికేషన్లు

కొన్ని మార్పులు మినహా ఆసుస్ ఏ3202 కూడా ఏ3402నే పోలి ఉంటుంది. 21.5 ఇంచుల ఎల్‍సీడీ డిస్‍ప్లేను ఆసుస్ ఏ3202 కలిగి ఉంది. ఇది రెండు ప్రాసెసర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5, కోర్ ఐ3 ప్రాసెసర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక పోర్టు ఆప్షన్లు, ర్యామ్, స్టోరేజ్, ఆడియోతో మిగిలిన స్పెసిఫికేషన్లన్నీ ఏ3402లానే ఉంటాయి.

Asus A3402, Asus A3202 Price: ధర, సేల్

ఆసుస్ ఏ3402 ప్రారంభ ధర రూ.65,990గా ఉంది. ఆసుస్ ఏ3202 ప్రారంభ ధర రూ.54,990గా ఉంది. ఆసుస్ ఈ-షాప్‍తో పాటు ఆసుస్ ప్రత్యేక స్టోర్లలోనూ ఈ ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‍లు అందుబాటులో ఉంటాయి. ఏ3202 మోడల్ ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లోనూ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

టాపిక్