తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Trade Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్స్ ఇవే.. డే ట్రేడింగ్ గైడ్

Stocks to Trade Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్స్ ఇవే.. డే ట్రేడింగ్ గైడ్

03 March 2023, 7:07 IST

    • Stocks to Trade Today: డే ట్రేడింగ్ చేసే వారు నేడు ఫోకస్ చేయాల్సిన కొన్ని స్టాక్‍‍లను నిపుణులు సూచించారు. అలాగే నేడు స్టాక్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటే..
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు లుక్కేయాల్సిన స్టాక్స్

Day Trading Guide for Today: ఒక్కరోజు లాభాల తర్వాత భారత మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. గురువారం సెషన్‍లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 129 పాయింట్లు కోల్పోయి 17,321.90 పాయింట్ల వద్దకు చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 501.73 పాయింట్లు నష్టపోయి 58,909.35 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 308.35 పాయింట్లు క్షీణించి 40,389.80 వద్దకు చేరింది. అదానీ గ్రూప్ స్టాక్‍ల్లో జరిగిన బల్క్ డీల్స్ వల్ల సూచీల వాల్యూమ్స్ కాస్త మెరుగ్గా ఉన్నాయి. నేడు (మార్చి 3, శుక్రవారం) భారత స్టాక్ మార్కెట్లు ఎలా మొదలయ్యే అవకాశం ఉంది.. డే ట్రేడింగ్ చేసే వారు గమనించాల్సిన స్టాక్స్ ఏవో ఇక్కడ చూడండి.

సానుకూల ఆరంభమే..!

Day Trading Guide for Today: ఎస్‍జీఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే నేడు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ఉంది. గురువారం అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముగియడం సానుకూల అంశంగా ఉంది.

Day Trading Guide for Today: కాగా, షార్ట్ టర్మ్‌లో నిఫ్టీలో ఇంకా బలహీనత కనిపిస్తోందని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అంచనా వేశారు. “ప్రస్తుతం నిఫ్టీ ట్రెండ్.. బలహీనంగానే కొనసాగుతోంది. 17,250 లెవెల్స్ వద్ద నిఫ్టీకి పరీక్ష ఎదురవుతుంది. ఒకవేళ అక్కడ కూడా నిఫ్టీ సపోర్ట్ తీసుకోలేకపోతే ఇక 17,000 రేంజ్‍కు వెళుతుంది. ఒకవేళ నిఫ్టీ ఇక్కడి నుంచి పైకి వెళితే 17,470 లెవెల్స్ వద్ద బలమైన రెసిస్టెంట్స్ కనిపిస్తోంది” అని ఆయన విశ్లేషించారు.

Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్

వోల్టాస్: బై అట్ రూ.918, టార్గెట్: రూ.954, స్టాప్ లాస్: రూ.902

హీరో మోటోకార్ప్: బై అట్ రూ.2,463, టార్గెట్: రూ.2,560, స్టాప్ లాస్: రూ.2,400

టోరెంట్ పవర్: బై అట్ రూ.515, టార్గెట్: రూ.530, స్టాప్ లాస్: రూ.506

సన్ ఫార్మా: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.980 నుంచి రూ.990, స్టాప్ లాస్: రూ.951

అంబుజా సిమెంట్స్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.390 నుంచి రూ.400, స్టాప్ లాస్: రూ.355

కోల్ ఇండియా: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.131, స్టాప్ లాస్: రూ.117

టాటా పవర్: బై అట్ రూ.205, టార్గెట్: రూ.212, స్టాప్ లాస్: రూ.196

ఏయూ బ్యాంక్: బై అట్ రూ.610, టార్గెట్: రూ.630, స్టాప్ లాస్: రూ.596

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)