తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Chief Jagan Speech In Party Plenary 2022

YSRCP Plenary: టార్గెట్ ఫిక్స్ చేసిన వైఎస్ జగన్… ప్లీనరీలో కీలక ప్రసంగం

HT Telugu Desk HT Telugu

09 July 2022, 16:29 IST

    • cm jagan speech in plenary: పార్టీ ప్లీనరీలో వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలే లక్ష్యంగా ముందుకు కదలలాని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్లీనరీలో జగన్
వైసీపీ ప్లీనరీలో జగన్ (twitter)

వైసీపీ ప్లీనరీలో జగన్

CM YS Jagan Speech: మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు వైసీపీ అధనేత, ముఖ్యమంత్రి జగన్. పార్టీ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలే టార్గెట్ గా ముందుకు కదలాలని స్పష్టం చేశారు. కార్యకర్తలతో నేతలు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

సీఎం జగన్ ప్రసంగం....

'ఈరోజు జన సునామీ కనిపిస్తోంది - 13 ఏళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు - కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్ - పార్టీని గట్టి పునాదులపై నిర్మించుకున్నాం. నాన్న మరణవార్త విని సుమారు 700 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను పరామర్శించడం నా బాధ్యతగా భావించా. నాపై కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేసి ఎన్నో కుట్రలు చేశాయి. ఇలాంటి కుట్రలకు, తప్పుడు కేసులకు లొంగేవాడు కాదు జగన్. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరింది. నన్ను అన్యాయంగా అరెస్ట్ చేయించిన పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. నాపై ఎప్పుడూ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఆనాడు చంద్రబాబు మా పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. నా ఫోకస్ అంతా ప్రజలకు మంచి చేయడమే, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం. క్యారెక్టర్, క్రెడిబులిటీయే మనల్ని ముందుకు నడిపిస్తాయి.3 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థను సృష్టించాం, 5 నెలలోనే గ్రామ, వారు సచివాలయాలను ఏర్పాటు చేశాం, మరింత పారదర్శక పాలన కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశాం. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవన్నీ అమలు చేస్తూనే ఉన్నాం. అని అన్నారు.

చంద్రబాబుపై ఫైర్...

ys jagan fiers on chandrababu: ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదన్నారు వైఎస్ జగన్. 'ఈ మధ్య చంద్రబాబు రింగ్‍లో చిప్ ఉందని చెప్తున్నారు. చందబాబులా రింగ్‍లోనో, మెకాళలోనో, అరికాళలోనో చిప్ ఉంటే సరిపోదు, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసింది మీ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి జరగాలనే రెవెన్యూ డివిజన్ చేశాం. పెత్తందార్ల ద్వారా పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ టీడీపీ. చంద్రబాబు పార్టీ సిద్ధాంతమే వెన్నుపోట్లు. చంద్రబాబు పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలంటున్నారు చంద్రబాబు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు, దుష్టచతుష్టయం విధానం. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసమే చంద్రబాబు శ్రమిస్తారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడానికి మనం శ్రమిస్తున్నాం. ఒక్క విద్యా రంగంలోనే ఏకంగా 9 పథకాలను అమలు చేస్తున్నాం. మూడేళ్లలోనే మ్యానిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశాం. మేనిఫెస్టోలో చెప్పిందే జగన్ చేశాడని నమ్మితే వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి.

గజ దొంగల ముఠాకు చంద్రబాబు నాయకుడని ఫైర్ అయ్యారు జగన్మోహ్ రెడ్డి. చంద్రబాబు హయాంలో డబ్బులు దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శంచారు. గజదొంగల ప్రభుత్వానికి,తేడా ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారని.. కానీ రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా పెట్టామని.. కానీ అంబేద్కర్ పేరు పెట్టినందుకే ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లనే తగలబెట్టారని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. అన్ని ఎన్నికల్లో విజయం సాధించామన్న జగన్... చక్రాలు లేని సైకిల్ చంద్రబాబ తొక్కలేకపోతున్నారని ఎద్దేవే చేశారు. తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడుని అరువు తెచ్చుకున్నారని... ఎల్లో మీడియా చెప్పినంత మాత్రానా అబద్దాలు నిజం కావని వ్యాఖ్యానించారు. గట్టిగా మొరిగినంత మాత్రానా గ్రామసింహాలు.. సింహాలు కావన్న జగన్... చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్టే అని స్పష్టం చేశారు.

'సంక్షేమ పథకాలను ఆపేయాలన్నదే దుష్టచతుష్టయం కుట్ర. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదే. నాకున్న ఏకైక అండాదండ ప్రజలే. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. మనం చేసిన మంచిని ప్రతి గడపకూ తీసుకెళ్లండి. ఎన్నికలకు మనం సన్నద్ధం కావాలి. రాష్ట్ర భవిష్యత్‍కు, మీ భవిష్యత్‍కు నాదే బాధ్యత. పార్టీ ఎప్పుడూ మీకు తోడుగా, అండగా ఉంటుంది' - జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత