తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /   Cm Ys Jagan News | ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్​న్యూస్​!

Cm YS Jagan news | ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్​న్యూస్​!

HT Telugu Desk HT Telugu

02 February 2022, 15:15 IST

    • రాష్ట్రంలోని కలెక్టర్లలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు సీఎం జగన్​. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్​ ఇవ్వాలని ఆదేశించారు.
సీఎం జగన్​
సీఎం జగన్​ (hindustan times)

సీఎం జగన్​

Grama sachivalayam news | ఆంధ్రప్రదేశ్​ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్​ డిక్లేర్​ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. జులై 1 నాటికి కొత్త జీతాలు అందే విధంగా.. జూన్​ 30లోగా ప్రక్రియ పూర్తి కావాలని తెలిపారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్​పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో జగన్​ ఈ విషయంపై అధికారులతో చర్చించారు.

మిగిలిన 25శాతం మందికి ప్రొబేషన్​కు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని అధికారులకు జగన్​ స్పష్టం చేశారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని, మార్చ్​లో పరీక్షలు ఉంటాయని అధికారులు జగన్​కు వివరించారు.

ఆ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్​సీ!

ఏపీ జెన్​కో, ట్రాన్స్​ కో, డిస్కం ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్​సీ ఏర్పాటు చేసింది జగన్​ ప్రభుత్వం. ఇందుకోసం వేతన సవరణ కమిషన్​ను నియమించింది. కమిషన్​కు ఛైర్మన్​గా.. రిటైర్డ్​ ఐఏఎస్​ మన్మోహన్​సింగ్​ వ్యవహరించనున్నారు. అలవెన్సులు, వేతనాలను సవరించే అంశంపై కమిషన్​ నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించనుంది.