LIVE UPDATES
CM Chandrababu : వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
Andhra Pradesh News Live September 17, 2024: CM Chandrababu : వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
17 September 2024, 21:25 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: CM Chandrababu : వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
- CM Chandrababu : విజయవాడ వరదల్లో నష్టపోయిన వారికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంటికీ రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్ ఆ పై ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, మత్స్యకారులు, పశునష్టం ఇలా అన్ని వర్గాలకూ ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
Andhra Pradesh News Live: RINL Apprentice Posts : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- RINL Apprentice Posts : విశాఖ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. స్టైఫండ్ కూడా ఇస్తారు.
Andhra Pradesh News Live: Jawahar Navodaya Admissions : జవహర్ నవోదయ సెలక్షన్ ఎగ్జామ్, దరఖాస్తు గడువు సెప్టెంబర్ 23 వరకు పొడిగింపు
- Jawahar Navodaya Admissions : నవోదయ విద్యాలయ సమితి (NVS) 6వ తరగతి ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీని పొడిగించింది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి.
Andhra Pradesh News Live: Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(ఎలక్ట్రానిక్ డిప్) డిసెంబర్ కోటా రేపు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల టిక్కెట్ల బుకింగ్ సెప్టెంబర్ 21న ప్రారంభం అవుతుంది.
Andhra Pradesh News Live: AP New Liquor Policy : మందుబాబులకు అదిరిపోయే న్యూస్, కేబినెట్ ఆమోదం లభిస్తే చాలు-ఇక అక్టోబర్ 1 నుంచి!
- AP New Liquor Policy : మందుబాబులు ఎన్నాళ్ల నుంచో ఏ వార్త కోసం ఎదురుచూస్తున్నారో... ఆ టైమ్ దగ్గర పడింది. ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై కసరత్తు పూర్తి చేసింది. కేబినెట్ ఆమోదం లభిస్తే అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చేస్తుంది. ఇవాళ సీఎం చంద్రబాబు కొత్త మద్యం పాలసీపై చర్చించారు.
Andhra Pradesh News Live: Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు.. పోలీసులపైనా చర్యలు!
- Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రోజుకో అప్‌డేట్ వస్తోంది. ఇటీవల వైసీపీ కీలక నేతలను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజా మరో అప్‌డేట్ ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో పోలీసులపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Andhra Pradesh News Live: Amaravati Safe: సేఫ్‌జోన్‌లోనే అమరావతి, కృష్ణానదితో ఇబ్బంది లేదన్న ఏపీ సర్కార్.. విఎంసి పన్ను హెచ్చరికలపై మంత్రి వివరణ
- Amaravati Safe: అమరావతిలో 2015-19 మధ్య ప్రారంభించిన నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, పునాదులు కూడా పనుల్ని కొనసాగించడానికి అనుకూలంగానే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణానది వరదల్ని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Andhra Pradesh News Live: Rampachodavaram : ఇదేం పైశాచికత్వం.. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్!
- Rampachodavaram : క్రమశిక్షణ పేరుతో ఓ ప్రిన్సిపల్ పైశాచికత్వం ప్రదర్శించారు. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించారు. దీంతో నడవలేని స్థితిలో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.
Andhra Pradesh News Live: Konaseema blast: కోనసీమ జిల్లాలో విషాదం... బాణసంచా తయారీ ఇంట్లో భారీ పేలుడు... ఏడుగురికి తీవ్ర గాయాలు
- Konaseema blast: కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ఇల్లు నేటమట్టం కాగా, ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి.
Andhra Pradesh News Live: Ganesh Nimajjanam: నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం, హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- Ganesh Nimajjanam: వేలాదిమంది భక్తులతో ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయల్దేరాడు. భాగ్యనగరమంతట గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి బయల్దేరడంతో కోలాహలంగా ఉంది. బాలాపూర్ గణేష్ విగ్రహం లడ్డూ వేలం పాట నిర్వహణ తర్వాత నిమజ్జనానికి బయల్దేరనుంది.
Andhra Pradesh News Live: Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే పరిస్థితి…
- Prakasam Barrage: విజయవాడ - గుంటూరు మధ్య పాత గ్రాండ్ ట్రంక్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి మూడో వారం ప్రవేశించింది. ఆగస్టు 31న భారీ వర్షాలు, కృష్ణానదికి ఎగువ నుంచి పోటెత్తిన వరద నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిచిపోయాయి.