తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live October 13, 2024: Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక
Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక
Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక

Andhra Pradesh News Live October 13, 2024: Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక

13 October 2024, 22:25 IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

13 October 2024, 22:25 IST

Andhra Pradesh News Live: Rapaka Vara Prasadarao : వైసీపీ నన్ను అవమానించింది, ఇక ఆ పార్టీలో కొనసాగను- ట్విస్ట్ ఇచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక

  • Rapaka Vara Prasadarao : రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలో వేరే పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేసినా... తనకు రాజోలు టికెట్ కేటాయించలేదని ఆయన ఆవేదన చెందారు.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 21:18 IST

Andhra Pradesh News Live: AP KGBV Notification : ఏపీ కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టులు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు-జిల్లాల వారీగా ఖాళీలు

  • AP KGBV Notification : ఏపీ కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తులకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 15 వరకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 19:17 IST

Andhra Pradesh News Live: AP Roads PPP Model : పీపీపీ మోడల్ లో రోడ్ల నిర్మాణం, 100 రోజుల కార్యాచరణకు నిపుణుల కమిటీ ఏర్పాటు

  • AP Roads PPP Model : ఏపీలో రోడ్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ మోడల్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు 100 రోజుల ఖరారు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ ప్రణాళికను ఖ‌రారు చేసి రెండు నెల‌ల్లో ప్రభుత్వానికి రిపోర్టు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 18:47 IST

Andhra Pradesh News Live: AP Rains Update : అల్పపీడనం ఎఫెక్ట్, రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్

  • AP Rains Update : రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 18:03 IST

Andhra Pradesh News Live: AP DSC: డీఎస్సీ ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. అక్టోబ‌ర్ 21 ఆఖ‌రు తేదీ

  • AP DSC: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వెలువడబోతోంది. దీంతో అభ్యర్థులు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. డీఎస్సీ అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 17:00 IST

Andhra Pradesh News Live: Chilamathur Gang Rape Case : చిలమత్తూరు సామూహిక అత్యాచారం కేసులో మైనర్లు, పోలీసుల అదుపులో ఆరుగురు!

  • Chilamathur Gang Rape Case : శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 16:39 IST

Andhra Pradesh News Live: AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల ఫైనల్ డేటా.. 11 ముఖ్యాంశాలు ఇవే!

  • AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. రేపు అధికారులు డ్రా తీయనున్నారు. ఇటు వైన్ షాపులను దక్కించుకోవడానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 89 వేల 882 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 16:17 IST

Andhra Pradesh News Live: Valmiki Jayanti 2024 : వాల్మీకి జ‌యంతిని రాష్ట్ర పండుగగా ప్రక‌టించిన ఏపీ ప్రభుత్వం, ఈనెల 17న అధికారికంగా నిర్వహ‌ణ‌

  • Valmiki Jayanti 2024 : ఏపీ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంత‌పురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జ‌యంతి వేడుక‌ను జ‌ర‌పాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది.

పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 16:14 IST

Andhra Pradesh News Live: Konaseema : కోనసీమ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. జనసేన మీటింగ్‌లో రాపాక వరప్రసాద్ ప్రత్యక్షం!

  • Konaseema : కోనసీమ రాజకీయాల్లో కొత్త సీన్ కనిపించింది. జనసేన మీటింగ్‌లో రాపాక వరప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. 2024లో వైసీపీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీచేసిన నేత.. జనసేన మీటింగ్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 16:00 IST

Andhra Pradesh News Live: AP Liquor Privilege Fee : ఏపీలో విదేశీ మద్యంపై అదనపు ప్రివిలేజ్ ఫీజు, క్వార్టర్ ధర మాత్రం రూ.99లకే

  • AP Liquor Privilege Fee : భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మార్పీలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాలకు రౌండాఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే క్వార్టర్ బాటిల్ ధర మాత్రం రూ.99 లకే నిర్థారించింది.

పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 13:11 IST

Andhra Pradesh News Live: AP Wine Shop Tenders 2024 : 2017 కంటే నాలుగు రెట్లు ఆదాయం ఎక్కువ.. జిల్లాల వారీగా వివరాలు ఇవే!

  • AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. సోమవారం 14వ తేదీన లాటరీ తీయనున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులపై ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం గురించి చర్చ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 12:11 IST

Andhra Pradesh News Live: Andhra Pradesh : రేప‌టి నుంచి ప‌ల్లె పండుగ- పంచాయ‌తీ వారోత్స‌వాలు.. కంకిపాడులో ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

  • Andhra Pradesh : రాష్ట్రంలో రేప‌టి నుంచి ప‌ల్లె పండుగ‌- పంచాయ‌తీ వారోత్స‌వాలను నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 14 నుంచి 20 వ‌ర‌కు 7 రోజుల పాటు జ‌రిగే వారోత్స‌వాల్లో.. 13,326 గ్రామాల్లో రూ.4,500 కోట్ల‌తో 30 ర‌కాల ప‌నుల‌కు శంకుస్థాపాలు చేయ‌నున్నారు. సంక్రాంతి వరకు పూర్తి చేయనున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 9:34 IST

Andhra Pradesh News Live: Dwaraka Tirumala : నేటినుంచి ద్వార‌కా తిరుమ‌లలో తిరుక‌ల్యాణ ఉత్స‌వాలు.. 16న కోన‌సీమ‌లో విజ‌య‌బేతాళ మ‌హోత్స‌వం

  • Dwaraka Tirumala : ద్వారకా తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆశ్వ‌యుజమాస దివ్య తిరుక‌ల్యాణ ఉత్స‌వాలను.. వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఉత్స‌వాలు జరగనున్నాయి. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆలయ అధికారులు చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 7:22 IST

Andhra Pradesh News Live: TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 8 రోజుల్లో హుండీ ఆదాయం ఎంతో తెలుసా..!

  • తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. ⁠ ⁠సామాన్య భ‌క్తుల‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. 
పూర్తి స్టోరీ చదవండి

13 October 2024, 6:30 IST

Andhra Pradesh News Live: Finance Commission Grants : ఏపీకి 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థ‌ల‌ నిధులు విడుద‌ల

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం 15 ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. రూ.988 కోట్లకుపైగా మొదటి విడతగా విడుదలైంది. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర పంచాయ‌తీ రాజ్ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

    ఆర్టికల్ షేర్ చేయండి