AP Wine Shop Tenders 2024 : 2017 కంటే నాలుగు రెట్లు ఆదాయం ఎక్కువ.. జిల్లాల వారీగా వివరాలు ఇవే!
AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. సోమవారం 14వ తేదీన లాటరీ తీయనున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులపై ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం గురించి చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో 4 వేల 380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 76 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సగటున 17 నుంచి 18 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు, రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో 2017లో రూ.474 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అప్పటికంటే తక్కువ దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.1,792 కోట్ల ఆదాయం వచ్చింది.
జిల్లాల వారీగా షాపులు.. దరఖాస్తులు..
1. శ్రీకాకుళం జిల్లాలో 158 షాపులకు 4 వేల 603 దరఖాస్తులు వచ్చాయి.
2.విజయనగరం జిల్లాలో 153 మద్యం దుకాణాలకు 5 వేల 237 అప్లికేషన్లు వచ్చాయి.
3.పార్వతీపురం మన్యం జిల్లాలో 52 షాపులకు 1376 దరఖాస్తులు వచ్చాయి.
4. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 140 షాపులు ఉండగా.. 1194 దరఖాస్తులు వచ్చాయి.
5.విశాఖపట్నం జిల్లాలో 155 వైన్ షాపులను నోటిఫై చేయగా.. 3 వేల 901 దరఖాస్తులు అందాయి.
6.అనకాపల్లి జిల్లాలో 136 షాపులు ఉండగా.. 3 వేల 215 దరఖాస్తులు వచ్చాయి.
7.కాకినాడ జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉండగా.. 3 వేల 278 దరఖాస్తులు వచ్చాయి.
8.కోనసీమ జిల్లాలో 133 వైన్ షాపులను నోటిఫై చేయగా.. 3 వేల 998 అప్లికేషన్లు అందాయి.
9.తూర్పు గోదావరి జిల్లాలో 125 షాపులకు గానూ.. 4 వేల 352 దరఖాస్తులు వచ్చాయి.
10.పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం దుకాణాల కోసం 5 వేల 419 అప్లికేషన్లు అందాయి.
11.ఏలూరు జిల్లాలో 144 వైన్ షాపుల కోసం 5 వేల 388 దరఖాస్తులు వచ్చాయి.
12.కృష్ణా జిల్లాలో 123 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా.. 2 వేల 866 అప్లికేషన్లు అందాయి.
13.ఎన్టీఆర్ జిల్లాలో 113 వైన్ షాపులకు అత్యధికంగా 5 వేల 787 దరఖాస్తులు వచ్చాయి.
14.గుంటూరు జిల్లాలో 127 వైన్ షాపులకు 4 వేల 396 అప్లికేషన్లు వచ్చాయి.
15.బాపట్ల జిల్లాలో 117 మద్యం దుకాణాల కోసం 2 వేల 90 అప్లికేషన్లు వచ్చాయి.
16.పల్నాడు జిల్లాలో 129 వైన్ షాపుల కోసం 2 వేల 591 దరఖాస్తులు వచ్చాయి.
17.ప్రకాశం జిల్లాలో మొత్తం 171 మద్యం దుకాణాలు ఉండగా.. 3 వేల 415 దరఖాస్తులు వచ్చాయి.
18.నెల్లూరు జిల్లాలో 182 వైన్ షాపులను నోటిఫై చేయగా.. 3 వేల 812 దరఖాస్తులు వచ్చాయి.
19.కర్నూలు జిల్లాలో 99 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా.. 3 వేల 20 అప్లికేషన్లు వచ్చాయి.
20.నంద్యాల జిల్లాలో 105 వైన్ షాపులను నోటిఫై చేయగా.. 2 వేల 180 దరఖాస్తులు అందాయి.
21. అనంతపురం జిల్లాలో 136 మద్యం షాప్‌లు ఉండగా.. 3వేల 100 దరఖాస్తులు వచ్చాయి.
22.శ్రీసత్యసాయి జిల్లాలో 87 షాపులు ఉండగా.. 1432 అప్లికేషన్లు వచ్చాయి.
23.కడప జిల్లాలో మొత్తం 139 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా.. 3 వేల 198 అప్లికేషన్లు వచ్చాయి.
24.అన్నమయ్య జిల్లాలో 111 వైన్ షాపుల కోసం 2 వేల 130 దరఖాస్తులు వచ్చాయి.
25.చిత్తూరు జిల్లాలో 104 మద్యం షాపుల కోసం 2 వేల 258 అప్లికేషన్లు వచ్చాయి.
26.తిరుపతి జిల్లాలో మొత్తం 227 మద్యం షాప్‌ల కోసం.. 3 వేల 750 దరఖాస్తులు వచ్చాయి.
(గమనిక- శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అందిన వివరాలు ఇవి)